- Telugu News Photo Gallery Technology photos World wide five countries ban whatsapp and social media apps
WhatsApp: ఈ ఐదు దేశాల్లో వాట్సప్ మెసేజింగ్ యాప్ పని చేయదు.. ఎందుకంటే..!
దేశంలో కొత్త ఐటీ రూల్స్‌కు సంబంధించి వాట్సాప్, భారత ప్రభుత్వం మధ్య యుద్ధం నడుస్తోంది. ఈ యుద్ధం నేపథ్యంలో వాట్సప్ బ్యా్న్ అంశం తెరపైకి వచ్చింది.
Updated on: May 28, 2021 | 10:49 PM

దేశంలో కొత్త ఐటీ రూల్స్‌కు సంబంధించి వాట్సాప్, భారత ప్రభుత్వం మధ్య యుద్ధం నడుస్తోంది. ఈ యుద్ధం నేపథ్యంలో వాట్సప్ బ్యా్న్ అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే ప్రపంచంలోని ఐదు దేశాలు వాట్సప్‌ను నిషేధించాయి. ఆ ఐదు దేశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చైనా: 2017 సంవత్సరంలోనే చైనా వాట్సాప్‌ను నిషేధించింది. ఇప్పటి వరకు ఆ నిషేధం తొలగించలేదు. చైనాలో కంటెంట్‌ను నియంత్రించాలని ప్రభుత్వం కోరుకుంటున్నందున మెసేజింగ్ యాప్‌ను నిషేధించడం జరిగింది. దీనికి బదులుగా వీచాట్‌ను చైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

వాట్సప్ బలమైన ఎన్క్రిప్షన్ విధానం కారణంగా వాట్సప్‌ను ఉత్తర కొరియా నిషేధించింది. కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం 2018 లో ఈ యాప్‌ను పర్మనెంట్‌గా నిషేధించింది.

యుఎఇలోనూ వాట్సప్‌ను నిషేధించారు. వాట్సాప్ వీడియో కాల్స్, ఫేస్‌టైమ్‌లను యుఎఇ అనుమతించదు. వాట్సాప్ యొక్క ఎన్క్రిప్షన్ విధానంతో ఇక్కడ సమస్య లేదు. అయితే, స్థానిక టెలీకమ్యూనికేషన్స్, దేశ ఆదాయం పెంచడానికి వీలుగా ఈ దేశం వాట్సప్‌పై నిషేధం విధించింది.

సిరియా దేశంలో కూడా వాట్సాప్ యొక్క ఎన్క్రిప్షన్ విధానం నిషేధించబడింది. సిరియా ప్రభుత్వం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉపయోగించి శత్రువులు కుట్ర చేయవచ్చని చెప్పి నిషేధం అమలు చేస్తోంది.

ఇరాన్ దేశంలో ఇటీవల జిమ్స్, వాట్సాప్, సిగ్నల్ సహా అన్ని మెసేజింగ్ యాప్‌లు నిషేధించబడ్డాయి. గోప్యతా విధానం కారణంగా వీటన్నింటిపై నిషేధం విధించడం జరిగింది. 2019 లో ట్విట్టర్, ఫేస్‌బుక్‌లను కూడా ఇరాన్ నిషేధించింది.




