- Telugu News Photo Gallery Technology photos Itel launch new smart phone a23 pro for only 3899 features and how to buy phone
ITEL A23 Pro Smart Phone: రూ. 3899కే స్మార్ట్ ఫోన్.. కొత్త ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్.. ఫీచర్లపై ఓ లుక్కేయండి..
ITEL A23 Pro Smart Phone: స్మార్ట్ ఫోన్ ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఐటెల్ కంపెనీ ఫీచర్ ఫోన్ ధరలోనే స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తోంది. ఐటెల్ ఏ23 ప్రొ స్మార్ట్ ఫోన్ ఆఫర్‌లో భాగంగా రూ. 3,899కే అందుబాటులో ఉంది...
Updated on: May 28, 2021 | 2:37 PM

ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్ కొనాలంటే తక్కువలో తక్కువ రూ. 15వేలు పెట్టాల్సిందే. కానీ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా భారత మార్కెట్లోకి ఐటెల్ కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది.

ఐటెల్ ఏ23 ప్రో పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 4999 కాగా.. రిలయన్స్ ప్రత్యేక ఆఫర్లో భాగంగా కేవలం రూ. 3,899కే అందిస్తోంది.

రిలయన్స్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్‌లో జియో ఎక్స్‌క్లూజివ్ ఆఫర్ కింద ఈ ధరకు అందిస్తున్నారు. తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. 5 అంగుళాల డిస్ ప్లే, క్వాడ్-కోర్ యునిసోక్ SC9832E ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు.

ఇక కెమెరా విషయానికొస్తే.. 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 0.3 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. ఫేస్ అన్‌లాక్‌తోపాటు.. 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, మైక్రో-యుఎస్‌బి చార్జర్, 2,400 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఈ ఫోన్ సొంతం.




