- Telugu News Photo Gallery Technology photos How to download instagram reels check here for full details
Instagram Reels: ఇకపై ఇన్‌స్టాగ్రమ్‌లో రీల్స్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. ఆఫ్‌లైన్‌లోనూ వీడియోలను ఆస్వాధించండి..
Instagram Reels: ఇకపై ఇన్‌స్టాగ్రమ్‌లో రీల్స్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. ఆఫ్‌లైన్‌లోనూ వీడియోలను ఆస్వాధించండి..
Updated on: May 27, 2021 | 9:16 PM

భారత్‌లో టిక్‌టాక్ బ్యాన్ అయిన తరువాత ఇన్‌స్టాగ్రమ్ రీల్స్‌కు విపరీతమైన క్రేజ్ పెరిగింది.

టిక్‌టాక్ వీడియోల మాదిరిగానే ఇన్‌స్టాగ్రమ్ రీల్స్ ఉంటాయి. ఈ వీడియోలలో తమకు ఇష్టమైన వీడియోలను యూజర్లు ఆస్వాదిస్తుంటారు. అయితే, ఇందులో వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి నేరుగా అవకాశం లేదు.

అయితే, ఇప్పుడు ఇన్‌స్టాగ్రమ్ రీల్స్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఇష్టమైన వీడియోను ఎంచుకోవాలి. వీడియోపైన కార్నర్‌లో ఉన్న త్రీ డాట్స్‌పై క్లిక్ చేయాలి.

ఆ తరువాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అకౌంట్ ఆప్షన్‌లో సేవ్‌డ్‌ని క్లిక్ చేయాలి.

సేవ్‌డ్‌ని క్లిక్ చేయడం ద్వారా ఇన్‌స్టాగ్రమ్ రీల్స్‌ని ఆన్‌లైన్‌లోనే కాక ఆఫ్‌లైన్‌లోనూ చూసుకునేందుకు అవకాశం ఉంటుంది.

థర్డ్ పార్టీ యాప్ ద్వారా కూడా రీల్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాఫిస్టా, ఇన్‌గ్రామర్ వంటి ఏ టూల్‌తోనైనా రీల్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.




