- Telugu News Photo Gallery Technology photos China tech giant oneplus launch one plus 40 y1 smart tv in india price and specifications
One Plus 40 Y1 TV: భారత మార్కెట్లోకి వన్ ప్లస్ కొత్త స్మార్ట్ టీవీ.. 40 అంగుళాల ఆండ్రాయిడ్ టీవీ ధర కేవలం..
One Plus 40 Y1 TV: స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సత్తా చాటుతోన్న చైనా టెక్ దిగ్గజాలు ఇప్పుడు స్మార్ట్ టీవీల తయారీలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు స్మార్ట్ టీవీలను తీసుకురాగా.. తాజాగా వన్‌ప్లస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని ప్రవేశపెట్టింది.
Updated on: May 27, 2021 | 3:43 PM

మొన్నటి వరకు స్మార్ట్ ఫోన్ రంగంలో అద్భుతాలు సృష్టించిన చైనాకు చెందిన కొన్ని టెక్ దిగ్గజాలు ఇప్పుడు స్మార్ట్ టీవీ రంగంలో సత్తా చాటుతున్నాయి.

తాజాగా ఈ జాబితాలోకి స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ కూడా వచ్చింది. ఈ క్రమంలోనే భారత్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ టీవీని తీసుకొచ్చింది.

వన్‌ప్లస్ 40 వై 1 పేరుతో విడుదల చేసిన ఈ 40 ఇంచెస్ టీవీ ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ ధరను రూ. 21,999గా నిర్ణయించారు. 40 ఇంచెస్ టీవీ ఇంత తక్కువ ధరకు, అందులోనూ వన్‌ప్లస్ వంటి బడా బ్రాండ్ నుంచి రావడం విశేషం.

మే 26న భారత మార్కెట్లోకి విడుదల చేసిన ఈ టీవీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.

హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనుగోలు చేసే వారికి 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ధర సుమారు రూ. రెండు వేలకుపైగా తగ్గనుంది.

ఆండ్రాయిడ్ ఓఎస్‌తో నడిచే ఈ స్మార్ట్ టీవీలో గూగుల్ అసిస్టెంట్‌తో పాటు గూగుల్ ప్లే స్టోర్ కూడా అందుబాటులో ఉంటుంది.





























