Telangana: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ గెలిచే స్థానాలు ఎన్నంటే.. మంత్రి ఎర్రబెల్లి లెక్క ఇదీ..

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన కామెంట్స్ చేశారు. రానున్న ఎన్నికల్లో పార్టీల బలాబలాలు, అధికార పార్టీ బలం, తదితర అంశాలపై..

Telangana: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ గెలిచే స్థానాలు ఎన్నంటే.. మంత్రి ఎర్రబెల్లి లెక్క ఇదీ..
Errabelli Dayakar Rao
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 17, 2023 | 12:28 PM

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన కామెంట్స్ చేశారు. రానున్న ఎన్నికల్లో పార్టీల బలాబలాలు, అధికార పార్టీ బలం, తదితర అంశాలపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సమీక్షలు నిర్వహించిన ఆయన.. పలు సమావేశాల్లో వరుసగా ఇవే అంశాలై కామెంట్స్ చేశారు. మళ్లీ బీఆర్ఎస్‌దే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తూనే.. వారిపై మాత్రం వ్యతిరేకత ఉందంటూ బాంబ్ పేల్చారు. అవును, అధికార పార్టీకి చెందిన 17, 20 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు ఎర్రబెల్లి. వాళ్లను మార్చేస్తే ఈసారి 100 సీట్లు దాటడం ఖాయం అని చెబుతున్నారు. ఒకవేళ వారు కూడా గెలిస్తే.. అది కేసీఆర్ ముఖం చూసి గెలిచినట్లేనని అన్నారు. మొత్తానికి 80 – 90 సీట్లతో మళ్లీ బీఆర్‌ఎస్ కే అధికారం దక్కుతుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్.

ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను లెక్కలోకే తీసుకోలేదు మంత్రి ఎర్రబెల్లి. మీడియాలో గప్పాలు కొడుతున్న బీజేపీకి.. క్షేత్రస్థాయిలో మాత్రం బలం సున్నా అని స్పష్టం చేశారు. ఆ పార్టీ ఎంత పోరాడినా 15, 20 స్థానాల్లోనే పోటీ ఇవ్వగలదని అన్నారు. కాంగ్రెస్ కూడా మహా అయితే 20, 25 స్థానాల్లోనే తలపడగలదన్నారు. మొత్తంగా రెండు పార్టీలు 20 స్థానాల వరకు పోటీని ఇచ్చే అవకాశం ఉందని, అంతకు మించి ఆ పార్టీలకు సీన్ లేదని తేల్చేశారు మంత్రి ఎర్రబెల్లి.

ఇలా తన మార్క్ కామెంట్స్‌తో పార్టీ కేడర్‌ని ఉత్సాహపరిచే ప్రయత్నం చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్.. ఎక్కడైనా స్థానిక నేతల మధ్య విభేదాలుంటే తగ్గించుకోవాలని సూచించారు. అధికారం పోతే పట్టించుకునేవాడు ఉండడని, అధికారం నిలబెట్టుకోవాలంటే తగాదాలు తగ్గించుకుని ఏకతాటిపైకి రావాలని పార్టీ శ్రేణులకు హితవుచెప్పారు మంత్రి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..