Khammam BRS: రేపే ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ.. నేడు హైదరాబాద్‌కు 3 రాష్ట్రాల సీఎంలు..

భారత రాష్ట్ర సమతి పార్టీ ఆవిర్భావ సభ బుధవారం నాడు ఖమ్మంలో జరుగనుంది. నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వామపక్ష నేతలు హాజరుకానున్న నేపథ్యంలో..

Khammam BRS: రేపే ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ.. నేడు హైదరాబాద్‌కు 3 రాష్ట్రాల సీఎంలు..
Brs Party
Follow us

|

Updated on: Jan 17, 2023 | 11:54 AM

భారత రాష్ట్ర సమతి పార్టీ ఆవిర్భావ సభ బుధవారం నాడు ఖమ్మంలో జరుగనుంది. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వామపక్ష నేతలు హాజరుకానున్న నేపథ్యంలో.. భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 100 ఎకరాల్లో 5 లక్షల మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్లెక్సీలు, కటౌట్లు, తోరణాలతో ఖమ్మం జిల్లా మొత్తం గులాబీమయం అయ్యింది. 4,198 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం నాడు ఖమ్మం జిల్లా మీదుగా వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు.

నేడు హైదరాబాద్‌కు..

బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నేపథ్యంలో ఢిల్లీ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, విజయన్, భగవంత్ మాన్‌లు ఇవాళ హైదరాబాద్‌ రానున్నారు. బుధవారం నాడు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు దర్శించుకోనున్నారు. అనంతరం ఖమ్మంలో జరుగనున్న బీఆర్ఎస్ సభకు హాజరుకానున్నారు నేతలు. సభా వేదికగాపై కేసీఆర్, కేజ్రీవాల్, విజయన్, భగవంత్ మాన్ నలుగురూ కలిసి కూర్చోనున్నారు.

బీఆర్ఎస్ మీటింగ్‌పై మంత్రి హరీష్ ఆసక్తికర కామెంట్స్..

బుధవారం నాడు ఖమ్మంలో జరుగనున్న సభకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. దేశానికి బీజేపీయేతర, కాంగ్రెసేతర నాయకత్వం కావాలని అన్నారు. బుధవారం నాడు నాలుగు జాతీయ పార్టీలుు ఖమ్మం వేదికపై కలవబోతున్నాయని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లేమితో సతమతం అవుతుందని, కేసీఆర్ నాయకత్వం బలపడితే తెలుగు ప్రజలకు గర్వకారణం అవుతుందన్నారు. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించనుందని తెలిపారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలు, మిగతా రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..