Telangana: మెదక్‌లో సజీవదహనం అయ్యాడు.. పూణెలో పట్టుబడ్డాడు.. సినిమాను మించి క్రైమ్..
మెదక్ జిల్లా టేక్మల్ కారులో సజీవదహనం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చనిపోయాడనుకున్న ధర్మానాయక్ సేఫ్ గా ఉన్నాడు. అదే కారులో గుర్తు తెలియని వ్యక్తి సజీవదహనం అయ్యాడు..
మెదక్ జిల్లా టేక్మల్ కారులో సజీవదహనం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చనిపోయాడనుకున్న ధర్మానాయక్ సేఫ్ గా ఉన్నాడు. అదే కారులో గుర్తు తెలియని వ్యక్తి సజీవదహనం అయ్యాడు. కారులో వ్యక్తిని ఉంచి పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు గుర్తించారు పోలీసులు. ఆ తరువాత తానే చనిపోయినట్లుగా పెద్ద స్టోరీ క్రియేట్ చేసినట్లు నిర్ధారించారు. అయితే, ఇదంతా ధర్మా ఎందుకు చేశాడు? కారులో సజీవ దహనం అయ్యింది ఎవరు? షాకింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తన పేరిట ఉన్న రూ. 7 కోట్ల ఇన్సూరెన్స్ కోసమే ధర్మానాయక్ ఈ డ్రామా ప్లే చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ స్కెచ్‌లో భాగంగా కొద్ది రోజుల క్రితం తన డ్రైవర్‌తో కలిసి కారులో వెళ్లాడు ధర్మా. సరిగ్గా మెదక్ జిల్లా టేక్మల్ వద్ద కారును ఆపాడు ధర్మా. కారులో డ్రైవర్ ఉండగానే బయటి నుంచి పెట్రోల్ పోసి నిప్పటించాడు. అతును అనుకున్నట్లుగానే.. కారు దగ్ధమైంది. కారులోని డ్రైవర్ కూడా సజీవ దహనం అయ్యాడు. ఈ ఘటనలో తానే చనిపోయినట్లుగా ధర్మా డ్రామా ప్లే చేశాడు. తద్వారా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ, పోలీసులు తమ మార్క్ లెవల్ ఇంట్రాగేషన్‌తో ధర్మా డ్రామాలు బయటపడ్డాయి. దగ్ధమైన కారు సమీపంలోనే ఓ పెట్రోల్ బాటిల్ లభ్యమైంది. దాని ఆధారంగా కూపీ లాగితే అసలు మ్యాటర్ బయటపడింది. రూ. 7 ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ధర్మా ఈ డ్రామా ప్లే చేసినట్లు తేల్చారు పోలీసులు.
కాగా, కారులో డ్రైవర్‌ను దహనం చేసిన ధర్మా నాయక్.. పరారయ్యాడు. కేసులో ప్రధాన నిందితుడు ధర్మానే అని తేల్చిన పోలీసులు.. పూణెలో తలదాచుకున్న నిందితుడిని పట్టుకున్నారు. సెక్రటేరియట్‌లో పని చేస్తున్న ధర్మా.. ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లతో భారీగా నష్టపోయాడు. ఈ నష్టాన్ని కవర్ చేసేందుకు సినిమా రేంజ్‌లో స్కెచ్ వేశాడు. కారులో మరొకరిని పెట్టి.. తానే సజీవదహనం అయినట్లు సీన్ క్రియేట్ చేశాడు. కానీ, ఘటనా స్థలంలో దొరికిన పెట్రోల్ బాటిల్ ఆధారంగా కేసు కొలిక్కి వచ్చింది.
అయితే, కారులో సజీవదహనం అయింది ఎవరు. చంపి కారులో పెట్టి దహనం చేశారా? బతికి ఉండగానే సజీవదహనం చేశారా? వివరాల కోసం ఆరా తీస్తున్నారు పోలీసులు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. ఇవాళ సాయంత్రం లోపు ఈ కేసుపై పోలీసులు క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
మరిన్ని తెెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..