AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలుగులో మాట్లాడారని నమ్మితే… 17 లక్షలు పాయె…

సైబర్ నేరగాళ్లు హిందీ, ఇంగ్లీషులో మాట్లాడుతూ ఉంటారు. కొందరు వచ్చీరానీ తెలుగులో మాట్లాడతారు.. వారిని ఈజీగా కనిపెట్టగలం అనుకుంటున్నారేమో.. ఇకపై అలా అనుకుంటే మీ ఖాతా ఖాళీ అవుతుంది జాగ్రత్త. ఎందుకంటే వాళ్లు బాధితులను నమ్మించేందుకు.. అచ్చమైన, స్వచ్చమైన తెలుగులో మాట్లాడుతున్నారు.

Telangana: తెలుగులో మాట్లాడారని నమ్మితే... 17 లక్షలు పాయె...
Man Lost Money (Representative image generated through AI)
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Feb 27, 2025 | 12:14 PM

Share

సైబర్ నేరగాళ్లు తమ పంథాను మార్చారు. ఇటీవలి వరకు తెలుగు రాష్ట్రాల వారితో  కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడి అమాయకులను బురిడీ కొట్టించి లక్షల రూపాయలు కాజేశారు. సైబర్ నేరస్తులపై దేశవ్యాప్తంగా అటు దర్యాప్తు సంస్థలతోపాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వాల సైతం అవగాహన కల్పిస్తుండటంతో సైబర్ నేరగాళ్లు సైతం రూటు మార్చారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడుతూ ఉంటే బాధితులు వెంటనే సైబర్ నేరస్తులను గుర్తించి కాల్స్ కట్ చేస్తున్నారు. దీంతో సైబర్ కేటుగాళ్లు కూడా రూట్ మార్చారు. భాషలపై పరిజ్ఞానం పెంచుకుంటున్నారు. తెలుగువారితో తెలుగులోనే మాట్లాడుతున్నారు. బాధితులకి సైబర్ నేరస్తులు తెలుగులో కాల్స్ చేయడం ప్రారంభించారు.

తాజాగా తెలుగులో మాట్లాడి సైబర్ మోసగాళ్లు ఓ వ్యక్తి నుంచి 17 లక్షలు గుంజేశారు. తెలుగులో మాట్లాడే వ్యక్తి నుంచి బాధితుడికి ఫోన్ కాల్ వచ్చింది. మోసగాడు తెలుగులో మాట్లాడటం వల్ల అవతలి వ్యక్తి చెప్పేది నిజమే అనుకున్నారు. మంచి ఆఫర్ దొరికిందని సంబరపడ్డాడు. సాధారణంగా చీటర్స్ తెలుగు సరిగ్గా మాట్లాడరు కదా మాయలో పడ్డాడు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును పరిశీలించి, మోసగాళ్లు వాయిస్ ట్రాన్స్‌లేటర్ ఉపయోగించి మోసం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. డిసెంబర్‌లో, 31 ఏళ్ల బాధితుడకి ఫేస్‌బుక్‌లో ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడంతో.. దాన్ని యాక్సెప్ట్ చేశాడు . ఆ తర్వాత మోసగాడు వాట్సాప్‌కు వచ్చి తనను “టాన్యా”గా పరిచయం చేసుకున్నాడు. ప్లిఫ్‌కార్ట్, కుకాయిన్ వంటి బ్రాండ్‌లను ప్రమోట్ చేసే పార్ట్-టైమ్ ఉద్యోగ అవకాశాన్ని వివరించాడు. వాటిని లైక్ చేయడం, చెల్లింపులు చేయడం వంటి పనులను చేసి కమీషన్‌తో రిఫండ్ అందుకోవచ్చని నమ్మించాడు. దీంతో మొదట చిన్న మొత్తాల్లో చెల్లింపులు చేసి రిఫండ్ అందుకున్న బాధితుడు, నమ్మకం పెరిగాక పెద్ద మొత్తాలు చెల్లించసాగాడు. చివరికి అతను 17 లక్షల రుపాయలు కోల్పోయాడు.

ఎవరు ఫోన్ కాల్స్ చేసినా ఈ తరహా ఆఫర్లు, టాస్కులు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అనుకోని పరిస్థితులలో డబ్బులు చెల్లిస్తే… వెంటనే 1930కు కాల్స్ చేసి ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి