Telangana: నల్ల పిల్లి మిస్సింగ్.. ఆచూకి చెప్తే నజరానా.. మీకు కనిపించిందా..?
అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లి ఆచూకి తెలుసుకునేందుకు ఓ యువతి వాల్ పోస్టర్లు అంటించిన ఘటన హనుమకొండలో చోటు చేసుకుంది. ఆ యువతి కుటుంబం ఓ పిల్లిని అల్లారుముద్దుగా పెంచుకుంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా...అకస్మాత్తుగా పిల్లి కనబడకుండా పోయింది. ఎంత వెతికినా జాడ లేదు. చివరకు పోస్టర్లు అంటించి పిల్లి ఆచూకి తెలిపిన వారికి తగిన పారితోషికం ఇవ్వనున్నట్లు వారు ప్రకటించారు.

ఇంట్లో మనుషులు ఎవరైనా తప్పిపోతేనో.. లేదంటే వాహనాలు, విలువైన వస్తువులు పోతే మిస్సింగ్ అని ప్రచారం చేయడం కామన్… కానీ పిల్లి మిస్సింగ్ ఓరుగల్లులో ఇప్పుడు హార్ట్ టాపిక్‌గా మారింది… ఆ పిల్లిని పట్టించిన వారికి 15 వేల రూపాయల నజరానా ప్రకటించారు యాజమాని. నగరంలో వెలసిన పిల్లి మిస్సింగ్ పోస్టర్లు చూపర్లను తెగ ఆశ్చర్య పరుస్తున్నాయి.
ఈ విచిత్ర ఘటన హనుమకొండలోని గుడిబండల్ ప్రాంతంలో జరిగింది.. నిశిత అనే యువతి కుటుంబం ఓ నల్ల పిల్లిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.. మూడేళ్ల నుండి పెంచుకుంటున్న ఈ పిల్లి వారి కుటుంబంలో ఒకరిగా కలిసిపోయింది.. ఆ పిల్లి గత వారం నుండి కనిపించడం లేదు.. ఆ పిల్లి ఏమైపోయిందో తెలియక కుటుంబమంతా తల్లడిల్లిపోతున్నారు.
పిల్లి ఫోటోలతో పోస్టర్లు ముద్రించిన నిషిత ఆ ప్రాంతమంతా ప్రధాన కూడళ్లలో పోస్టర్లు అంటించారు.. పిల్లిని పట్టించిన వారికి 15 వేల రూపాయల నజరానా ప్రకటించారు.. నల్ల పిల్లి ఫోటోలు పోస్టర్లు ముద్రించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆ పిల్లి అంటే తనకు ప్రాణం అంటున్న నిశిత తన పిల్లిని పట్టించిన వారికి 15 వేలు కాదు అవసరమైతే 20 వేలు కూడా ఇస్తానంటుంది.. ఇక్కడ మూగజీవులపై ప్రేమను మాత్రమే చూడాలని.. ఆ పిల్లితో పెనవేసుకున్న అనుమబంధమే తనను మానసికంగా కుంగిపోయేలా చేస్తుందని యాజమాని నిశిత ఆవేదన వ్యక్తం చేస్తుంది.

Missing Cat
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి




