Telangana: ఈ పాఠశాలల్లో సీటొస్తే టెన్త్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్.. అంతేకాదు
పేద విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే సంకల్పంతో ఆదర్శ పాఠశాలలకు శ్రీకారం చుట్టారు. ఆదర్శ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీంతో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను ఆదర్శ పాఠశాలల్లో చేర్పించేందుకు పోటీ పడుతున్నారు. మీరు కూడా మీ పిల్లల్ని చేర్చించాలనుకుంటున్నారా..?

తెలంగాణ రూరల్ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అదించేందుకు సర్కార్.. ఆదర్శ పాఠశాలలు తీసుకొచ్చింది. అయితే వీటిల్లో 2025- 26 అకడమిక్ ఇయర్ కోసం 6 నుంచి 10 తరగతుల వరకు జాయిన్ అయ్యేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. అడ్మిషన్ కోసం ఎగ్జామ్‌కు అప్లై చేసుకునేందుకు ఫిబ్రవరి 28 వరకు గడువు ఇచ్చారు. ఆపై మార్చి 10 వరకు పొడిగించారు. ఇక్కడ అడ్మిషన్ దొరికితే.. ఇంటర్ వరకు నాణ్యమైన విద్య ఉచితంగానే అందిస్తారు. బాలికలకు అయితే హాస్టల్ సదుపాయం కూడా ఇస్తారు. https:///telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ నోటిఫై చేసిన స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. ఓసీ విద్యార్థులు 200 చెల్లించి అప్లై చేసుకోవాలి. BC, SC, ST, EWS, PHC కేటగిరీలకు చెందిన విద్యార్థులకు అప్లికేషన్ ఫీజు రూ.125గా నిర్ధారించారు.
ఏప్రిల్ 3వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 13న దరఖాస్తు చేసిన స్కూల్‌లోనే ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఉదయం 10-12 వరకు 6వ తరగతి, మధ్యాహ్నం 2-4 వరకు 7-10 తరగతుల వారికి ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. విద్యార్థుల తల్లిదండ్రులు త్వరతిగతిన అప్లై చేసుకుంటే.. సీటు వస్తే వారి భవితకు ఢోకా ఉండదు. 6వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఎలక్ట్రానిక్స్, ఐటీ, అగ్రికల్చర్, బ్యూటీషియన్ వంటి వృత్తి విద్య కోర్సు చదివే సౌలభ్యం ఉంది. స్కూల్స్ ఎంపిక చేసిన కోర్సుల్లో స్టూడెంట్స్ తమకు నచ్చిన ఏదో కోర్సు ఎంచుకొని చదవొచ్చు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి




