రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. జూబ్లీహిల్స్‌లోని ఓ షాపులో 3 గంటల్లో 3 కోట్ల విలువ చేసే మద్యం అమ్మకం..!
Telangana Liquor Sales: తెలంగాణలో రికార్డు స్దాయి మద్యం అమ్మకాలు జరిగాయి. రాష్ట్రంలో రేపటి నుంచి లాక్‌డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. దీంతో మద్యం షాపుల వద్ద మద్యం..
Telangana Liquor Sales: తెలంగాణలో రికార్డు స్దాయి మద్యం అమ్మకాలు జరిగాయి. రాష్ట్రంలో రేపటి నుంచి లాక్‌డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. దీంతో మద్యం షాపుల వద్ద మద్యం ప్రియులు బారులు తీరారు. కరోనా కాలంలో ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా ఎగబడి మద్యాన్ని కొనుగోలు చేశారు. రాష్ట్రంలో బుధవారం నుంచి లాక్‌డౌన్ ప్రకటించడంతో మంగళవారం సాయంత్రం నుంచి మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. పెద్ద సంఖ్యలో మందు బాబులు మద్యం షాపుల వద్ద బారులు తీరారు. ఇక జూబ్లీ హిల్స్ లోని ఒక మద్యం షాపు వద్ద కేవలం 3 గంటల వ్యవధిలోనే 3.5 కోట్ల రూపాయల మద్యం విక్రయం జరిగింది. ఒక షాపులో ఇంత తక్కువ సమయంలో ఇంత అధిక మొత్తం అమ్మకాలలో ఇదే ఆల్ టైమ్ రికార్డు స్దాయి అని అధికారులు చెపుతున్నారు.
అయితే తెలంగాణలో బుధవారం నుంచి పది రోజుల పాటు విధించే లాక్‌డౌన్‌లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. దీంతో లాక్‌డౌన్ ప్రకటన వెలువడగానే అన్ని మద్యం దుకాణాల వైపు పరుగులు పెడుతూ వైన్స్ షాపుల వద్ద భారీ సంఖ్యలో జనాలు క్యూ కట్టారు. కొన్ని మద్యం దుకాణాల వద్ద అయితే కిలోమీటర్ మేర బారులు తీరారు. దీంతో మద్యం షాపుల యజమానులు తమ ప్రైవేటు సిబ్బందితో రద్దీని తగ్గించే ప్రయత్నం చేశారు. జూబ్లీహిల్స్, చైతన్యపురి, హయత్‌నగర్, సికింద్రాబాద్, కవాడిగూడ, లక్డీకాపూల్, నారాయణగూడ, ఎస్‌ఆర్‌నగర్, కృష్ణా నగర్, యూసుఫ్ గూడ, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో మద్యం దుకాణాలు రద్దీగా మారిపోయాయి.