Telangana Lock Down: తెలంగాణలో రేపటి నుంచి లాక్‌డౌన్ విధింపు.. ఈ-పాస్ ద్వారానే ప్రత్యేక ‘పాస్’ల జారీ..

Telangana Lock Down: తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి లాక్‌డౌన్ విధించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు..

Telangana Lock Down: తెలంగాణలో రేపటి నుంచి లాక్‌డౌన్ విధింపు.. ఈ-పాస్ ద్వారానే ప్రత్యేక ‘పాస్’ల జారీ..
Mahender Reddy
Follow us

|

Updated on: May 11, 2021 | 10:22 PM

Telangana Lock Down: తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి లాక్‌డౌన్ విధించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే షాపులు, ఇతర కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చింది. 10 దాటిన తరువాత కఠినమైన లాక్‌డౌన్ అమలు చేయాలని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, లాక్‌డౌన్ కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది ప్రభుత్వం. ఎవరైనా అత్యావసరం, విధి నిర్వహణ నేపథ్యంలో వేరే రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు వెళ్లాలంటే పాస్‌ తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పాస్‌ను ఆయా జిల్లాల్లో పోలీసు అధికారులు జారీ చేస్తారని కూడా ప్రకటించింది.

ఈ నేపథ్యంలోనే ఈ-పాస్‌లపై డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటన చేశారు. వేరే రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ-పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు అందజేయనున్నట్లు డీజీపీ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అందజేసే ఈ-పాస్‌ల కోసం https://policeportal.tspolice.gov.in/ అనే వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో గాను లాక్ డౌన్ సడలించిన సమయంలో కాకుండా ఇతర సమయాల్లో ప్రయాణించేవారికి మాత్రమే పాసులను జారేచేస్తామని తెలిపారు.

ఇతర రాష్ట్రాలకూ, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లే వారికి సంబంధిత పోలీస్ కమీషనర్లు, ఎస్పీ లు మాత్రమే పాస్ లను జారీ చేస్తారని తెలిపారు. అయితే, ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణా రాష్ట్రానికి వచ్చే వారికి మాత్రం సంబంధిత రాష్ట్రాల నుండే పాస్‌లు జారీ చేస్తారని తెలిపారు. హైదరాబాద్‌లో ఒక కమిషనరేట్ నుండి మరో కమిషనరేట్ పరిధికి ప్రయాణించే వారికి ప్రయాణం ప్రారంభమయ్యే పరిధిలోని కమీషనరేట్ నుండే పాసులు జారీ చేస్తారని వివరించారు. లాక్ డౌన్ సడలింపు సమయమైన ఉదయం 6 గంటల నుండి 10 గంటల లోపు ప్రయాణించే వారికి ఏవిధమైన పాసులు అవసరం లేదని స్పష్టం చేశారు.

Also read:

Zombie Reddy: మ‌ళ్లీ భ‌య‌పెట్ట‌డానికి వ‌స్తోన్న జాంబీలు..? క‌రోనా సెకండ్ వేవ్ ప్రేర‌ణతో..

మహారాష్ట్రను అతలాకుతలం చేస్తున్న కరోనా.. రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు.. కొత్తగా ఎన్ని కేసులంటే..!

దేవాదాయ శాఖ కీలక నిర్ణయం.. బుధవారం నుంచి ఆలయాల్లో దర్శనాలు నిలివేస్తున్నట్లుగా ప్రకటించిన మంత్రి

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్