Lock Down Telangana: లాక్ డౌన్‌ను కఠినంగా అమలు చేయండి.. పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన డీజీపీ..

Lock Down Telangana: ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి..

Lock Down Telangana: లాక్ డౌన్‌ను కఠినంగా అమలు చేయండి.. పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన డీజీపీ..
Dgp Mahender Reddy
Follow us

|

Updated on: May 11, 2021 | 9:55 PM

Lock Down Telangana: ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి.. పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి పది రోజులపాటు రాష్ట్రంలో లాక్‌డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రేంజ్ ఐజీలు, డీఐజీ లు, పోలీస్ కమీషనర్లు, ఎస్.పీ లతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ జితేందర్ కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ కమీషనర్లు, ఎస్పీ లు, డీఐజీ స్థాయి సీనియర్ పోలీస్ అధికారులందరూ విధిగా క్షేత్రస్థాయిలో ఉండి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

లాక్ డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యే ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని అన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా హెడ్ క్వార్టర్లు, ప్రధాన నగరాలలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణా లపై ఏవిధమైన ఆంక్షలు లేవని తెలిపారు. జాతీయ రహదారులపై రవాణా పై ఏవిధమైన ఆంక్షలు లేవని అన్నారు. ప్రధాన రంగంలో ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తమ అక్రిడేషన్లు కానీ, పత్రికా పరమైన గుర్తింపు కార్డులు తమవెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు.

గ్రామాల్లో వ్యవసాయ సంబంధిత పనులు, ఉపాధిహామీ పనులను లాక్ డౌన్ నుండి మినహాయించారని డీజీపీ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వారి శాఖా పరమైన గుర్తింపు కార్డులుంటే సరిపోతుందన్నారు. రాష్ట్రంలో జరిగే వివాహాలకు ఇరువైపులకు చెందిన 40 మంది మాత్రమే హాజరయ్యే విధంగా చూడాలని అన్నారు. వివాహలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని అన్నారు. అదేవిధంగా, మరణాలకు సంబంధించి కేవలం 20 మంది మాత్రమే హాజరు కావాలని డీజీపీ స్పష్టం చేశారు.

కరోనా వాక్సినేషన్‌కు ఎవరైనా వెళ్లాల్సివస్తే వారి మొదటి డోస్‌కు సంబందించిన సమాచారం సెల్ ఫోన్ లో చూసి వారికి సడలింపు ఇవ్వాలని అధికారులకు డీజీపీ దిశానిర్దేశం చేశారు. నిత్యావసర వస్తువుల రవాణా సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజిమెంట్ చట్టంతో పాటు ఐపీసీ ప్రకారం తగు కేసులు నమోదు చేయాలని మహేందర్ రెడ్డి పోలీస్ అధికారులకు స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేసే వారికి ఈ- పాస్ విధానం ద్వారా సంబంధిత కమీషనర్లు, ఎస్పీ లు పాసులను జారీ చేస్తారని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు.

Also read:

Southern Railway Recruitment: ఇండియ‌న్ రైల్వేలో మెడిక‌ల్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. గురువార‌మే చివ‌రి తేది..

Andhra Corona Updates: ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స ఫీజులు నిర్ణయిస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ ఉత్త‌ర్వులు

కరోనాతో మరణిస్తే ఎల్ఐసీ పాలసీ వర్తిస్తుందా? లేదా? ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలిపిన LIC

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
పెరుగుతో ఇది కలిపి ప్యాక్‌ వేస్తే.. ఇలా వాడితే తెల్లజుట్టు నల్లగా
పెరుగుతో ఇది కలిపి ప్యాక్‌ వేస్తే.. ఇలా వాడితే తెల్లజుట్టు నల్లగా
చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్..
చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్..
ఛీ.. ఛీ.. వీళ్లసలు తల్లిదండ్రులేనా? ఈ వీడియో చూస్తే మీరూ.!
ఛీ.. ఛీ.. వీళ్లసలు తల్లిదండ్రులేనా? ఈ వీడియో చూస్తే మీరూ.!
ఈ 5 ఆహారాలు మీ కిడ్నీలు పాడై పోవడం ఖాయం.. వెంటనే మానేయండి!
ఈ 5 ఆహారాలు మీ కిడ్నీలు పాడై పోవడం ఖాయం.. వెంటనే మానేయండి!
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
బీఆర్ఎస్‎కు బిగ్ షాక్.. కాంగ్రెస్‎లో చేరనున్న మరో ఎమ్మెల్యే..
బీఆర్ఎస్‎కు బిగ్ షాక్.. కాంగ్రెస్‎లో చేరనున్న మరో ఎమ్మెల్యే..
పర్పుల్ క్యాప్‌లో అగ్రస్థానికి యార్కర్ కింగ్..
పర్పుల్ క్యాప్‌లో అగ్రస్థానికి యార్కర్ కింగ్..
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.