మహారాష్ట్రను అతలాకుతలం చేస్తున్న కరోనా.. రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు.. కొత్తగా ఎన్ని కేసులంటే..!

Maharashtra Corona Updates: కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక వైపు కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగా,..

మహారాష్ట్రను అతలాకుతలం చేస్తున్న కరోనా.. రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు.. కొత్తగా ఎన్ని కేసులంటే..!
Coronavirus

Maharashtra Corona Updates: కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక వైపు కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగా, మరోవైపు కరోనా కట్టడికి చర్యలు కొనసాగుతున్నాయి. అయినా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక దేశంలో కరోనా జాబితాలో మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్రలో అయితే తీవ్ర స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 40,956 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక కరోనాతో 793 మంది మృతి చెందారు. ఒక్క రోజే 71,966 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. అలాగే తాజాగా ముంబైలోనే 1717 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, 51 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కరోనా నుంచి 6082 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 51,79,929కు చేరింది. ప్రస్తుతం 5,58,996 యాక్టివ్‌ కేసులు ఉండగా, కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 77,191కు పెరిగింది.

కాగా, మహారాష్ట్రలో తీవ్ర స్థాయిలో పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదు అవుతుండటంతో మరింత ఆందోళన నెలకొంది. కరోనా కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌, నైట్‌ కర్ఫ్యూ విధిస్తున్నారు. ఒక వైపు వ్యాక్సినేషన్‌ జరుగుతుండగా, మరోవైపు కేసుల తీవ్రత ఎక్కువైపోతోంది.

ఇవీ కూడా చదవండి:

Corona Fear: కరోనా మహమ్మారితో మరో భయం..మానసికంగా నలిగిపోతున్న ప్రజలు..ఆందోళనతో అనారోగ్యం!

Corona Effect: కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయా..?.. నిపుణులేమంటున్నారు..?