Telangana: సొంతగూటిలోనే మాటల యుద్ధాలు.. టీపీసీసీ చీఫ్‌పై వెంకట్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు
Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. సొంత పార్టీలోనే ముసలం మొదలవుతోంది. ఒకే గూటిలో ఉన్న నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు..

Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. సొంత పార్టీలోనే ముసలం మొదలవుతోంది. ఒకే గూటిలో ఉన్న నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో రాష్ట్రంలో రాజకీయాలు మరింతగా రాజుకున్నాయి. మాటల యుద్ధంతో హోరెత్తిస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణ పీసీసీ చీఫ్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికపై జరుగుతున్న సమావేశాలకు ఎలాంటి ఆహ్వానం లేదని, పిలవని పేరంటానికి వెళ్లాల్సిన అవసరం లేదని అంటున్నారు. దాసోజు శ్రవణ్ మాట్లాడిన ప్రతిమాటా కరెక్టే అంటున్నారు వెంకటరెడ్డి.
ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడు ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు. మునుగోడు సమావేశాల దృష్ట్యా పీసీసీ చీఫ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జానారెడ్డి ఇంటికి వెళ్తారు కానీ.. మా ఇంటికి రాలేదన్నారు. నన్ను బ్రాందీ షాప్‌లో పని చేసిన వాళ్ళతో పోలుస్తాడా..? ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడను.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ దగ్గర తేల్చుకుంటానని వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. నాపై అద్దంకి చేసిన వ్యాఖ్యలకు ఆ సమావేశంలోనే క్షమాపణ చెప్పాల్సిందని అన్నారు.




ఇదికూడా చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు
