Gautam Adani: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి భద్రత పెంపు.. Z కేటగిరి ఏర్పాటు

Gautam Adani: దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ భద్రతను పెంచారు. ప్రభుత్వం ఆయనకు జెడ్ కేటగిరి భద్రత కల్పించింది. IB ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా..

Gautam Adani: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి భద్రత పెంపు.. Z కేటగిరి ఏర్పాటు
Gautam Adani
Follow us
Subhash Goud

|

Updated on: Aug 10, 2022 | 8:30 PM

Gautam Adani: దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ భద్రతను పెంచారు. ప్రభుత్వం ఆయనకు జెడ్ కేటగిరి భద్రత కల్పించింది. IB ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా ఈ భద్రతను ఏర్పాటు చేయడం జరుగుతుంది. గౌతమ్ అదానీ దేశంలోని బిలియనీర్లలో ఒకరు. ప్రస్తుతం అదానీ బృందం దేశంలోని చాలా ముఖ్యమైన అనేక ప్రాజెక్టులతో అనుబంధం కలిగి ఉంది. అటువంటి పరిస్థితిలో వారి భద్రతపై ఆందోళనలు తలెత్తాయి. అదానీ కంటే ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీలకు కూడా జెడ్ భద్రత కల్పించారు.

Z సెక్యూరిటీ అంటే ఏమిటి..?

దేశంలోని ముఖ్యమైన వ్యక్తుల భద్రత కోసం అనేక వర్గాలు సృష్టించబడ్డాయి. వీటిని X, Y, Z వర్గాలు అంటారు. అదనంగా SPG కూడా ఉంటుంది. ఎస్‌పీజీ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఇది దేశ ప్రధానికి రక్షణ కల్పిస్తుంది. రాష్ట్రపతికి కూడా ఉంటుంది. తరువాత ముఖ్యమైన వ్యక్తుల భద్రత వివిధ వర్గాలుగా విభజించబడింది. ఇందులో ముఖ్యమైనవి Z ప్లస్ కేటగిరి, Z కేటగిరిలు. మాజీ ప్రధానులు, కేబినెట్‌ మంత్రులకు జెడ్‌ ప్లస్‌ భద్రత ఉంటుంది. మరోవైపు ఇతర ముఖ్యమైన వ్యక్తులు Z రక్షణ ఉంటుంది. ITBP, CRPF అధికారులతో సహా మొత్తం 33 మంది సిబ్బంది Z కేటగిరిలో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ రక్షణ పొందే వీఐపీల కోసం ఈ సెక్యూరిటీ నిబంధనల ప్రకారం జరుగుతుందని, భద్రతను పటిష్టం చేసేందుకు ఎక్కడికైనా వారు వచ్చినప్పుడు స్థానిక పోలీసుల సాయం కూడా తీసుకుంటారు. వారి ప్రాణాలకు ముప్పు తీవ్రతను బట్టి భద్రత స్థాయిని ఎంపిక చేస్తారు.

ఇవి కూడా చదవండి

ప్రపంచంలోని టాప్ ఐదుగురు ధనవంతులు:

గౌతమ్ అదానీ ప్రస్తుతం భారతదేశం, ఆసియాలో అత్యంత ధనవంతుడు. ఫోర్బ్స్ రియల్ టైమ్ జాబితా ప్రకారం.. అతని నికర విలువ $ 129 బిలియన్లను దాటింది. ప్రస్తుతం అతను ఎలోన్ మస్క్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్ కంటే ధనవంతుడు. ముఖేష్ అంబానీ ఈ జాబితాలో నికర విలువ 98 బిలియన్లు విలువతో పదో స్థానంలో ఉన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి