BIG BREAKING: తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు.. సర్కార్ కీలక నిర్ణయం.!

తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ అంశంపై సుధీర్ఘంగా..

BIG BREAKING: తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు.. సర్కార్ కీలక నిర్ణయం.!
Follow us

|

Updated on: Jun 09, 2021 | 5:36 PM

తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ అంశంపై సుధీర్ఘంగా చర్చించిన మంత్రివర్గం.. ప్రస్తుత కరోనా పరిస్థితులను, విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరీక్షల నిర్వహణ మంచిది కాదని అభిప్రాయపడింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సహా కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు చేసి.. గ్రేడింగ్ విధానంలో ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. ఫస్ట్‌ ఇయర్‌లో వచ్చిన గ్రేడ్‌ల ప్రకారమే సెకండియర్‌లో గ్రేడింగ్‌ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

కాగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా గతంలోనే రాష్ట్ర స్థాయిలో పదో తరగతి పరీక్షలను, ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేసింది. అయితే సెకండ్ ఇయర్ పరీక్షలను వాయిదా వేస్తూ.. జూన్ నెలలో నిర్వహించనున్నట్టు ప్రకటించగా.. తాజా పరిస్థితుల నేపథ్యంలో సెకండ్ ఇయర్ పరీక్షలు కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, పరీక్షల రద్దు, ఫలితాల విధానంపై సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఇవి చదవండి:

రెప్పపాటులో ఊహించని యాక్సిడెంట్‌.. కుక్క ఓవర్‌ స్పీడ్‌.. చూస్తే షాక్ అవ్వాల్సిందే! వైరల్ వీడియో

ఆ వ్యాక్సిన్ వేసుకున్న వరుడే కావలెను.. నవ్వులు పూయిస్తున్న వధువు పెళ్లి ప్రకటన..

వీడు మామూలోడు కాదు.. సెహ్వాగ్, డివిలియర్స్‌ను మించిపోయాడు.. 20 బంతుల్లో సెంచరీ బాదేశాడు..