Kamareddy District Selfie Suicide: రూ.50వేల గొడవ ప్రాణం తీసేంది.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువకుడి ఆత్మహత్య!
50వేల గొడవ ప్రాణం తీసేసుకునే వరకు వెళ్లింది. ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదన్న కోపం.. నా అనుకున్న బంధువులే ఎదురు తిరుగుతున్నారన్న ఆవేదన తీవ్ర మనస్తాపానికి గురి చేసింది.
Selfie Suicide in Kamareddy District: 50వేల గొడవ ప్రాణం తీసేసుకునే వరకు వెళ్లింది. ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదన్న కోపం.. నా అనుకున్న బంధువులే ఎదురు తిరుగుతున్నారన్న ఆవేదన తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. అంతే.. సీరియస్ నిర్ణయానికి వచ్చి ఆత్మహత్యాయత్నానికి చేసుకోబోయాడు. అది కూడా ఓ సెల్ఫీ ఫోటో తీసుకొని చనిపోయే ప్రయత్నం చేశాడు. ఆ సెల్ఫీ ఫోటోను తన బంధువులకు కూడా షేర్ చేశాడు. అంతే.. అందరు షాక్. ఉరుకులు పరుగులు. అడవుల చుట్టూ, రోడ్ల వెంట, బావుల దగ్గర వెతకడం మొదలు పెట్టారు. చివరాఖరుకు చావు బతుకుల మధ్య ఉన్న స్థితిలో కనిపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో జరిగింది. బీబీపేట్ మండలం యాడారం గ్రామానికి చెందిన రమేష్‌కి లింగంపల్లి గ్రామానికి చెందిన రజితతో కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. ఈ మధ్య వచ్చిన రూ.50వేల పంట డబ్బులను తల్లిగారి ఇంటికి పంపించుకుంది రజిత. ఇద్దరు కలిసి లింగంపల్లికి వెళ్లారు. అక్కడ ఆదివారం సాయంత్రం రమేష్ తన బావమరిది అయిన శ్రీకాంత్, నవీన్, మామ వెంకట్‌లు కలిసి మద్యం సేవించారు. ఈ సమయంలోనే వారి మధ్య 50వేల కోసం గొడవ మొదలై.. తీవ్రస్థాయికి చేరుకుంది. అంతే.. సొంతూరు యాడారం వెళ్లిన రమేష్ విషయాన్ని తల్లికి చెప్పి ఎక్కడికో వెళ్లి పోయాడు. అప్పటికే తీవ్ర మానసిక వేధనతో ఉన్న రమేష్ సూసైడ్ చేసుకుంటున్నట్టుగా సెల్ఫీ ఫోటో తీసి బంధువులకు పంపాడు. అంతే.. అంతా కంగారుతో పోలీసుల సహాయంతో చుట్టుపక్కల వెతికారు.
సోమవారం ఉదయం దోమకొండ శివారులోని మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద రమేష్ బైక్, చొక్కా దొరికింది. ఆ ఆధారంతో తీవ్ర గాలింపు చేపట్టారు. మంగళవారం ఉదయం బిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులోని కోళ్ల ఫారం వద్ద రమేష్ ప్రాణాలతో దొరికాడు. రమేష్‌ను దోమకొండ పోలీసులు ఆస్పత్రికి తరలించారు. దోమకొండ ఆసుపత్రిలో రమేష్‌ను పోలీసులు విచారించగా తన తోడళ్లుడు, అతని తమ్ముడు ఎక్కడికో తీసుకెళ్లాడని వివరించాడు. బంధువులే చంపాలని చూశారని వాపోతున్నాడు బాధితుడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధితుడి సోదరుడు. కాగా, ఈ ఘటనకు సంబంధించికేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also…. Guntur Young Man beaten death: ప్రాణం తీసిన సెల్‌ఫోన్.. కాల్ చేసుకుంటానంటే ఇచ్చిన పాపానికి యువకుడు బలి!