AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur Young Man beaten death: ప్రాణం తీసిన సెల్‌ఫోన్.. కాల్ చేసుకుంటానంటే ఇచ్చిన పాపానికి యువకుడు బలి!

క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. చిన్నపాటి గొడవతో పిడిగుద్దులతో దాడి చేసుకున్న ఘటనలో ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు.

Guntur Young Man beaten death: ప్రాణం తీసిన సెల్‌ఫోన్.. కాల్ చేసుకుంటానంటే ఇచ్చిన పాపానికి యువకుడు బలి!
Death
Balaraju Goud
|

Updated on: Jun 09, 2021 | 10:12 AM

Share

Guntur Young Man beaten death: క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. చిన్నపాటి గొడవతో పిడిగుద్దులతో దాడి చేసుకున్న ఘటనలో ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. మొబైల్ ఫోన్ కోసం ఇద్దరు యువకుల మధ్య ఆరంభమైన వివాదం కొట్లాటకు దారితీసి, చివరికి షేక్‌ షఫివుల్లా(26) అనే యువకుడి ప్రాణం పోవడానికి కారణమైంది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. చేబ్రోలు మండల కేంద్రానికి చెందిన షఫివుల్లా కూలిపని చేసుకొని జీవిస్తున్నాడు. స్థానిక జెండాచెట్టు సమీపంలోని ప్రైవేటు ఏటీఎం వద్ద ఓ ఫోన్‌ చేసుకొని ఇస్తానంటూ షఫివుల్లాకు చెందిన మొబైల్ ఫోన్‌ను అలీఖాన్‌ తీసుకున్నాడు. అనంతరం తన ఫోన్‌ ఇవ్వాలని షఫివుల్లా అడగడంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. మద్యం మత్తులో ఉన్న ఈ ఇద్దరూ నెట్టుకొని అనంతరం పరస్పరం తలపడ్డారు.

ఇదే క్రమంలో ఒక్కసారిగా షఫీవుల్లా కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడి నుంచి అలీఖాన్‌ పారిపోయాడు. స్థానికులు అక్కడికి చేరుకుని షఫీవుల్లాను కూర్చోబెట్టారు. అతన్ని ఆసుపత్రికి తరలించేలోపే యువకుడు మృతిచెందాడు. ఇతని తల్లి షేక్‌ హబుల్లాకు ఇద్దరు మగపిల్లలు కాగా, భర్త మాఫిర్‌ కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. ఇద్దరు పిల్లలను ఆమె కష్టపడి పెంచింది. చేతికందివచ్చిన పెద్ద కుమారుడి మృతితో తల్లడిల్లిపోయింది.

హైదరాబాద్‌కు చెందిన అలీఖాన్‌ ఇక్కడ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. షఫీవుల్లా మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also… Suicide: ‘నా భార్య వల్లే చనిపోతున్నా’.. ఉత్తరం రాసి ఉరేసుకున్న భర్త.. రొంపిచర్లలో విషాదం..