YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో మూడో రోజు సీబీఐ విచారణ.. కంప్యూటర్ ఆపరేటర్‌తోపాటు మరొకరిని ప్రశ్నిస్తున్న అధికారులు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. మరి నిజం తేలేదెప్పుడు?... వివేకా కుటుంబసభ్యుల అనుమానాలు, ఆరోపణలు ఎవరి పైన?
YS Viveka Murder Case CBI Inquires: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. మరి నిజం తేలేదెప్పుడు?… వివేకా కుటుంబసభ్యుల అనుమానాలు, ఆరోపణలు ఎవరి పైన? దర్యాప్తులో ప్రశ్నిస్తుందెవర్ని? రాజకీయ రంగు పులుముకున్న వివేక హత్య కేసు విచారణలో జాప్యానికి కారణాలేంటి?.. ఫస్ట్ ఫేజ్ విచారణకు కరోనా ఫస్ట్‌వేవ్‌తో కళ్లెం పడింది. సెకండ్ వేవ్ చివరాఖర్లో ఇప్పుడు దర్యాప్తులో ఇలాంటి సీన్లు తెరపైకి రాబోతున్నాయన్నది చర్చగా మారింది.
వైఎస్ వివేకా హత్య కేసులో మూడో రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన ఇదయతుల్లాతో పాటు పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్‌లను సీబీఐ అధికారులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. నిన్న ఇదయతుల్లాను 7 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు.. ఇవాళ మరోసారి అతడిని విచారణకు పిలిచారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఈ విచారణ జరుగుతోంది. నిన్న వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరిని అధికారులు విచారించిన అనంతరం.. అతను ఇచ్చిన సమాచారం మేరకు ఇదయతుల్లాను ప్రశ్నిస్తున్నారు.
ఇదిలావుంటే, 2019 మార్చిలో వివేకా హత్య జరిగిన సమయంలో ఆయన మృతదేహాన్ని తొలుత ఇదయతుల్లా తన ఫోన్‌లో ఫొటోలు తీసినట్లు అధికారుల వద్ద ప్రాథమిక సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో హత్య జరిగినప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? బాత్‌రూమ్ నుంచి వివేకా మృతదేహన్ని బెడ్‌రూమ్‌లోకి ఎవరు తరలించారనే తదితర విషయాలపై అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. Read Also…. Baba Ramdev: మరో ట్రబుల్ లో చిక్కుకున్న బాబా రాందేవ్……నేపాల్ లో ‘కొరొనిల్’ మెడిసిన్ పంపిణీ నిలిపివేత !