AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ సీఎస్ సోమేష్‌కు బిగ్ షాక్.. ఏపీ క్యాడర్‌కు వెళ్లాలని హైకోర్టు ఆదేశం..

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు రాష్ట్ర హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. సోమేష్ కుమార్ ఏపీ క్యాడర్‌కు వెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది..

Telangana: తెలంగాణ సీఎస్ సోమేష్‌కు బిగ్ షాక్.. ఏపీ క్యాడర్‌కు వెళ్లాలని హైకోర్టు ఆదేశం..
Cs Somesh Kumar
Shiva Prajapati
|

Updated on: Jan 10, 2023 | 11:28 AM

Share

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు రాష్ట్ర హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. సోమేష్ కుమార్ ఏపీ క్యాడర్‌కు వెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది హైకోర్టు ధర్మాసనం. డీఓపీటీ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ఈ తీర్పునిచ్చింది. అయితే, సీఎస్ సోమేష్ కుమార్ తరఫు న్యాయవాది 3 వారాల వ్యవధి కోరగా.. తిరస్కరించింది హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ బెంచ్.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం.. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల విభజనను కూడా పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి సోమేష్‌ కుమార్‌‌ను సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిందిగా కేంద్రం స్పష్టం చేసింది. అయితే, తనను ఏపీకీ కేటాయించడంపై సోమేష్‌ కుమార్‌ కేంద్ర అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. దాంతో సోమేష్ కుమార్  సోమేష్‌ కుమార్‌ సేవలు తెలంగాణ రాష్ట్రానికి అవసరమని భావిస్తే ఆంధ్రా అనుమతితో డిప్యూటేషన్‌పై కొనసాగించుకోవాలని సూచించింది క్యాట్. ఈ నిర్ణయంపై డీఓపీటీ హైకోర్టులో కేసు వేసింది. ఇలా కొన్నాళ్లుగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.

ఇప్పుడు ఈ కేసుపై విచారించిన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం..  ట్రైబ్యునల్‌ ఆదేశాలను ఇప్పుడు కొట్టివేసింది. సోమేష్ కుమార్ తన సొంత క్యాడర్‌ స్టేట్‌కు వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఇదే సమయంలో 3 వారాల సమయం కావాలని సోమేష్ కుమార్ అభ్యర్థించగా.. హైకోర్టు అందుకు నిరాకరించింది. ఎలాంటి సమయం ఇవ్వమని తేల్చి చెప్పింది హైకోర్టు. దాంతో హైకోర్టు తీర్పు ను సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు సీఎస్ సోమేశ్ కుమార్. మరోవైపు తీర్పు కాపీ రాగానే ఏపి కి వెళ్లిపోవాలని హైకోర్టు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

ఏపీ క్యాడర్‌కు చెందిన సోమేష్.. ఇంతకాలం తెలంగాణ సీఎస్‌గా కొనసాగారు. ఇక ఇప్పుడు హైకోర్టు కూడా ఆయన సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పడంతో. ఈ నేపథ్యంలో నెక్స్ట్‌ ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..