Telangana Government: దళిత బంధు అమలుపై కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.. 24 గంటల్లోగా..

Telangana Government: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెచ్చిన దళిత బంధు పథకంపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ పథకం అమలు తీరుపై విచారించిన..

Telangana Government: దళిత బంధు అమలుపై కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.. 24 గంటల్లోగా..
Telangana High Court
Follow us

|

Updated on: Aug 18, 2021 | 2:56 PM

Telangana Government: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెచ్చిన దళిత బంధు పథకంపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ పథకం అమలు తీరుపై విచారించిన హైకోర్టు ధర్మాసనం.. ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. జీవో విడుదల చేసిన 24 గంటల్లోనే వెబ్‌సైట్‌లో అప్‌లోడబ్ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాసాలమర్రిలో దళిత బంధు అమలును సవాల్ చేస్తూ వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ సేన్ రెడ్డి తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. నిబంధనలు ఖరారు చేయకుండానే దళిత బంధుకు నిధులు విడుదల చేశారని పిటిషన్‌లో ఆరోపించారు.

అయితే, దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధు వర్తిస్తుందని ప్రభుత్వం తరఫున ఏజీ ప్రసాద్ తెలిపారు. నిబంధనలు ఖరారు చేసినట్లు అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ కోర్టుకు వివరించారు. అయితే, నిబంధనలకు సంబంధించిన జీవో వెబ్‌సైట్‌లో లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది శశికిరణ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కోర్టు.. జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బందేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏజీ వివరణను నమోదు చేసిన కోర్టు.. వాసాలమర్రిలో దళిత బంధు అంశంపై విచారణను ముగించింది. జీవోలన్నీ 24 గంటల్లోగా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెట్టాలని ఆదేశించింది.

హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళితబంధు’ స్కీమ్‌‌ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా అర్హులైన దళితులందరికీ కుటుంబానికి రూ. 10 లక్షలు చొప్పున నగదును అందజేస్తారు. ఈ డబ్బుతో లబ్దిదారులు వ్యాపారం చేయడ ద్వారానో, మరే ఇతర మార్గాల ద్వారానో అత్యున్నత స్థాయికి చేరాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.

Also read:

AP Crime News: కొబ్బరికాయల లోడేలే అనుకున్నారు.. ఫార్మల్‌గా చెక్ చేశారు.. పోలీసుల మైండ్ బ్లాంక్

Afghanistan Crisis: తాలిబన్ 2.0 ప్రారంభం అవుతోంది..ఇది మళ్ళీ ఉగ్రవాదులకు ఊపిరి అందిస్తుందా? అంతర్జాతీయ నిపుణులు ఏమంటున్నారు?

TDP – YCP: మాకు అవమానం జరిగింది.. లోకేష్‌పై SC-ST అట్రాసిటీ కేసు పెట్టండి.. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున డిమాండ్..