Crop loan scam: తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పంట రుణాల గోల్‌మాల్.. 12 మంది అరెస్ట్.. కీలక విషయాలు వెల్లడించిన సీపీ
Crop loan scam: తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పంట రుణాల గోల్‌మాల్ వ్యవహారంలో తవ్వే కొద్ది నిజాలు బయటకు వస్తున్నాయి. ఇద్దరు బ్యాంకు మేనేజర్లు, ఓ కారు డ్రైవర్ కలిసి..
Crop loan scam: తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పంట రుణాల గోల్‌మాల్ వ్యవహారంలో తవ్వే కొద్ది నిజాలు బయటకు వస్తున్నాయి. ఇద్దరు బ్యాంకు మేనేజర్లు, ఓ కారు డ్రైవర్ కలిసి పంట రుణాల్లో గోల్‌మాల్ చేసినట్లు తేలింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోటు చేసుకున్న ఈ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అధికారుల సంతకాలు పోర్జరీ, నకిలీ పాసుపుస్తకాలు, సొంతంగా తయారు చేయించుకున్న స్టాంపులతో డ్రైవర్ వ్యవహారం మొత్తం నడిపించగా, బ్యాంకు మేనేజర్‌లు క్షేత్ర స్థాయి పరిశీలన లేకుండా కమీషన్ల కోసం రూ.2 కోట్ల రుణాలుగా ఇచ్చేశారు. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్టు చేయగా, ఐదుగురు పరారీలో ఉన్నారు. శుక్రవారం రామగుండం పోలీసు కమిషనరేట్‌లో సీపీ సత్యనారాయణ పూర్తి వివరాలు వెల్లడించారు.
కథంతా డ్రైవరే నడిపాడు..
2016 నుంచి 2019 వరకు బ్యాంకు మేనేజర్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్న ప్రభాకర్ పంట రుణాలు తీసుకోవడానికి ఏ పత్రాలు అవసరమో పూర్తి అవగాహన పెంచుకున్నాడు. ముత్తారం మండలం మైదంబడ్డ గ్రామానికి చెందిన అతడు పంట రుణాలు తీసుకోవడానికి అవసరమైన నకిలీ పత్రాలు తయారు చేయించుకున్నాడు. ముత్తారం తహసీల్ కార్యాలయం ముందు జిరాక్స్ దుకాణం నడిపే కక్కడపు అశోక్‌ను సంప్రదించాడు. రబ్బర్ స్టాంపుల కోసం పెద్దపల్లి శ్రీ రాజరాజేశ్వర రబ్బర్ స్టాంప్‌లను తయారు చేసే సుధాకర్‌ను కలిశాడు. అతని వద్ద ఆర్డీవో, తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, వీఆర్వో తదితర స్టాంపులను తయారు చేయించుకున్నాడు. పట్టా పాస్‌బుక్‌లు, టైటిల్ డీడ్ కసం మంథని ఆర్డీవో కారు డ్రైవర్‌గా పని చేస్తున్న సదానందంతో చేతులు కలిపాడు.
ప్రభాకర్ ముత్తారం, రామగిరి మండలాల్లో తనకు తెలిసిన వారికి పంట రుణాలు ఇప్పిస్తానని చెప్పాడు. తర్వాత ప్రభుత్వం వాటిని మాఫీ చేస్తుందని ప్రచారం చేశాడు. మొత్తం 153 మందికి ఇలా అప్పులు ఇప్పించాడు. ఒక్కో రుణానికి రూ.5 కమీషన్ ఇస్తాని చెప్పి అప్పట్లో బ్యాంకు మనేజర్‌లుగా పని చేసిన రామానుజాచార్య, వెంకటేశ్వర్లతో బేరం కుదుర్చుకున్నాడు. వారు క్షేత్ర స్థాయిలో పరిశీలన లేకుండా ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున పంట రుణం ఇచ్చాడు. అయితే ప్రభాకర్‌కు సహకరించి రుణాలు ఇప్పించిన రవీందర్, శ్రీనివాస్, అనిల్‌కు మార్, భూమయ్య, ప్రవీణ్, సదానందం, అశోక్, సత్యనారాయణ, సదన్న, శివకుమార్, రాజేందర్‌లను అరెస్టు చేసినట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. మరి కొందరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. అయితే అదుపులో తీసుకున్న వారి నుంచి రూ.5,55,000 నగదు, నకిలీ పాస్ పుస్తకాలు, రబ్బర్ స్టాంపులు తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
కాగా, ఈ బ్యాంకు అక్రమాల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై పోలీసులు ఇప్పటికే లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. ఈ వ్యవహారంలో ఇంకేవరైనా ఉన్నారా..? అనేదానిపై ఆరా తీస్తున్నారు. పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని అరెస్టు చేసి ఇంకేమైనా వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవీ కూడా చదవండి :
Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా..
Andhra Bank: పాత ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. కొత్త నిబంధనలు.. గుర్తించుకోవాల్సిన విషయాలు
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
<iframe width=”795″ height=”447″ src=”https://www.youtube.com/embed/WqTePi5KF_c” title=”YouTube video player” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>