Telangana: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ పోర్టల్‌లోకి ప్రజావాణి ఫిర్యాదులు
గత పది ఏళ్లుగా తమకు ఏదైనా సమస్య వస్తే ముఖ్యమంత్రి దృష్టి వరకు ఎలా తీసుకెళ్లాలో తెలియక ఇబ్బంది పడ్డ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారం లోకి రాగానే ప్రజావాణి కార్యక్రమంతో సమస్యలను నేరుగా సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలల్లో తరలివస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే తన మార్కు చూపించారు. ఇన్ని రోజులు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలా అర్థం కాక ఇబ్బంది పడుతున్న ప్రజలకు నేనున్నానంటూ అభయ హస్తమిస్తున్నారు. పరిష్కారం కాని సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే..

హైదరాబాద్, డిసెంబర్ 15: గత పది ఏళ్లుగా తమకు ఏదైనా సమస్య వస్తే ముఖ్యమంత్రి దృష్టి వరకు ఎలా తీసుకెళ్లాలో తెలియక ఇబ్బంది పడ్డ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారం లోకి రాగానే ప్రజావాణి కార్యక్రమంతో సమస్యలను నేరుగా సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలల్లో తరలివస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే తన మార్కు చూపించారు. ఇన్ని రోజులు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలా అర్థం కాక ఇబ్బంది పడుతున్న ప్రజలకు నేనున్నానంటూ అభయ హస్తమిస్తున్నారు. పరిష్కారం కాని సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే విలైనంత తొందరలో పరిష్కరిస్తానంటూ ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టారు. గత 10ఏళ్ళు గా చీమకుడా దూరని దుర్భైద్యమైన సెక్యూరిటీతో ఉన్న సీఎం క్యాంప్ ఆఫీస్ అయిన ప్రగతి భవన్ లోకి సామాన్యులకు ప్రవేశం కల్పించారు. అక్కడ ప్రజా దర్బార్ ప్రారంభించారు. ఆ తర్వాత దాన్ని ప్రజావాణిగా పేరు మార్పు చేశారు. సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే ప్రజా భవన్ కి వెళ్లి ప్రజల సమస్యలు దగ్గరుండి వినడంతో రాష్ట్రం నలుమూలల నుంచి సీఎంతో తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చేవారి తాకిడి పెరిగింది.
గతవారం వరుసగా మూడు రోజులు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఈ వారం నుంచి వారంలో మంగళ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు ఉంటుందని పేర్కొన్నారు. వివిధ రకాల సమస్యలతో రాష్ట్ర నలుమూలనుంచి వస్తున్నారు. ప్రజా భవన్ ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా మారుస్తూ జీవో జారీ కావడంతో ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్వయంగా పాల్గొన్నారు. ప్రజావాణిలో వస్తున్న సమస్యల్లో ముఖ్యంగా డబల్ బెడ్ రూమ్ ఇల్లు, ధరణి సమస్యలు, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వల్ల నష్టపోయిన వాళ్ళు, సంవత్సరాల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ పథకం కింద కేటాయించిన స్థలాలను ఆక్రమించిన సమస్యలు, కాంట్రాక్ట్ నర్సులు, మాజీ సైనిక ఉద్యోగులు, వికలాంగులు ఇలా పలు రకాల సమస్యలతో ప్రజావాణికి వేలల్లో ప్రజలు క్యూ కట్టడంతో ఆ క్యు పంజాగుట్ట సిగ్నల్ వరకు వెళ్ళింది.
వచ్చిన ప్రతి కంప్లైంట్ ని అధికారులు దగ్గరుండి నోట్ చేసుకుంటున్నారు. ఫిర్యాదులను నమోదు చేయడానికి సత్వర పరిష్కారాన్ని చూపడానికి ఒక మెకానిజంని సిద్ధం చేస్తున్నారు. కంప్లైంట్ ఇచ్చే ప్రతి ఒక్కరి మొబైల్ నెంబర్ ని మెన్షన్ చేస్తూ వచ్చిన ప్రతి కంప్లైంట్ ని మొదటగా ఆన్లైన్ పోర్టల్ అప్లోడ్ చేస్తున్నారు. శాఖలు, జిల్లాలు వారీగా సంబంధిత అధికారులు కుదిరిన వారికి సత్వర పరిష్కారం, జటిలమైన వాటి సాధ్యాసాధ్యాలను నివేదిక వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించవచ్చని భావిస్తున్నారు.హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ప్రజావాణి కార్యక్రమానికి కావలసిన అన్ని ఏర్పాట్లు వాటి పర్యవేక్షణ దగ్గరుండి చూసుకుంటున్నారు. జీహెచ్ఎంసీకి సంబంధించిన అన్ని శాఖలు ఈ ప్రజావాణి కార్యక్రమం కోసం పనిచేస్తున్నాయి. కంప్లైంట్ రిజిస్టర్ అయినట్టుగా ఆన్లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేసిన వెంటనే మొబైల్ ఫోన్లకి మెసేజ్ వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఆ మొబైల్ నెంబర్ ఆధారంగా కంప్లైంట్ ఇచ్చిన వారిని సంబంధిత అధికారులు సంప్రదించి సత్వర పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది అంటున్నారు.
గతంలో టీపీసీసీ అధ్యక్షుడు హోదాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పరిష్కారం కోరినప్పుడు డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తామని చెప్పారు. అప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలను చూపిస్తూ అనేకమంది బారులు తీరారు. సీఎం రేవంత్ రెడ్డి ని ప్రత్యక్షంగా కలిసి తమ గోడు చెప్పుకోవాలని తాపత్రయపడ్డారు. రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు గతంలో గాంధీభవన్లో తనకు ఉద్యోగం కావాలని కలిసిన మరుగుజ్జు మహిళ రజినికి స్వాగతం పలికి అందరి ముందు తనకు ఉద్యోగం ఇస్తున్నట్టుగా జీవోను జారీ చేశారు. చాలామంది వికలాంగులు రజినీలాగే తమకు సాయం అందుతుందని ప్రజా భవన్ కి క్యూ కడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




