మహిళలకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. ఉచితంగా కుట్టు మిషన్లు..! ఇలా అప్లై చేసుకోండి!
తాజాగా మహిళా సాధికారిత దిశగా అడుగులు వేస్తున్నారు. వారికి ఆర్థిక చేయూత అందించేందుకు రకరకాల స్కీమ్స్ అమలు చేస్తోన్న రేవంత్ రెడ్డి సర్కార్.. మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది. మహిళలంతా వారి కాళ్ల మీద వారు నిలబడాలన్న ఉద్దేశంతో అందరికీ ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంది. ఆ తర్వాత అడ్రెస్ కూడా పూర్తిగా నింపాలి. సంబంధిత సర్టిఫికెట్లు కూడా జత చేయాలి. ముస్లిం, సిక్కు, పార్సీ, బౌద్ధ, జైనులు లాంటి మతాలకు చెందిన మైనార్టీ మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. ఇటీవల ట్రాన్స్‌జెండర్స్‌కు పోలీసు శాఖలో ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా వారు గౌరవప్రదంగా జీవించేలా నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మహిళా సాధికారిత దిశగా అడుగులు వేస్తున్నారు. వారికి ఆర్థిక చేయూత అందించేందుకు రకరకాల స్కీమ్స్ అమలు చేస్తోన్న రేవంత్ రెడ్డి సర్కార్.. మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది. మహిళలంతా వారి కాళ్ల మీద వారు నిలబడాలన్న ఉద్దేశంతో అందరికీ ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంది. ఇందులో భాగంగానే.. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇందిరమ్మ మహిళా శక్తి స్కీమ్ కింద.. మైనారిటీ వర్గాలకు చెంది అర్హత ఉన్న మహిళలకు.. ఫ్రీగా కుట్టు మిషన్లను ఇవ్వనున్నారు. అర్హులైన వారు నేరుగా.. https://tgobmms.cgg.gov.in కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.
అక్కడ ఓపెన్ అయిన ఫారంలో పేరు, రేషన్ కార్డు డిటైల్స్, సంవత్సర ఆదాయం, ఆధార్ నంబర్, పెళ్లి వివరాలు, మొబైల్ నెంబర్, మతం, టైలరింగ్ ట్రైనింగ్ వివరాలు, చదువు వంటి వివరాలు ఫిల్ చేయాలి. ఆ తర్వాత అడ్రెస్ కూడా పూర్తిగా నింపాలి. సంబంధిత సర్టిఫికెట్లు కూడా జత చేయాలి. ముస్లిం, సిక్కు, పార్సీ, బౌద్ధ, జైనులు లాంటి మతాలకు చెందిన మైనార్టీ మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..