Papaya Seeds: బొప్పాయి పండు గింజలు ఇలా తింటే ఎన్ని లభాలో తెలిస్తే..అస్సలు పడేయరు..!
బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక వ్యాధులను నయం చేస్తుంది. అయితే, చాలా మంది బొప్పాయి గింజలను చెత్తగా భావించి పారేస్తారు. కానీ, మీరు అలా చేయకండి..ఎందుకంటే, విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ ఎ, మెగ్నీషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు బొప్పాయిలో సమృద్ధిగా ఉంటాయి. బొప్పాయి మాదిరిగా, దాని విత్తనాలు కూడా అంతే ప్రయోజనకరమైనవి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ రోజు మనం బొప్పాయితో పాటు దాని విత్తనాల వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
Updated on: Jan 25, 2025 | 2:37 PM

బొప్పాయి గింజలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ విత్తనం పేగుల్లోని పురుగులు, బ్యాక్టీరియాను తొలగించడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి, మీరు బొప్పాయి గింజలను కూడా తీసుకోవాలి. బొప్పాయి గింజలు తీసుకోవడం వల్ల రుతుక్రమంలో నొప్పి తగ్గుతుంది.

Papaya Seeds

Papaya Seeds

బొప్పాయి గింజల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది. మీరు ఈ విత్తనాలను కూడా తినాలి. బొప్పాయి గింజల్లో యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం, జుట్టు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది.

బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగించి ఆకలిని నియంత్రిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి.





























