- Telugu News Photo Gallery People with these problems should not eat apples at all, Check Here is Details
Apple Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం యాపిల్ అస్సలు తినకూడదు..
యాపిల్‌లో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు లభిస్తాయి. శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే కొన్ని రకాల సమస్యలతో బాధ పడేవారు మాత్రం ఖచ్చితంగా యాపిల్‌కి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ సమస్యలతో బాధ పడేవారు ఈ ఫ్రూట్‌కి దూరంగా ఉండాలి..
Chinni Enni | Edited By: Shaik Madar Saheb
Updated on: Jan 26, 2025 | 11:22 AM

ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. యాపిల్‌లో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. రోజూ ఒక యాపిల్ తినడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా అడ్డుకోవడంలో హెల్ప్ చేస్తుంది. యాపిల్ తింటే రోగాలు దూరంగా ఉంటాయని వైద్యులు చెబుతారు.

ఐబీఎస్ వంటి సమస్యలు ఉన్నవారు యాపిల్ తినకూడదు. ఎందుకంటే యాపిల్‌లో ఫ్రక్టోజ్ అనే చక్కెర ఉంటుంది. దీని వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు తినకుండా ఉండటమే మంచిది.

అలెర్జీ సమస్యలు ఉన్నవారు కూడా యాపిల్‌కి దూరంగా ఉండటం మంచిది. దీని వల్ల నోరు, పెదవులు, గొంతు, చర్మం మీద దురద వాపు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి వాళ్లు కూడా యాపిల్ తినకూడదు.

యాపిల్ ఎప్పుడైనా సరే భోజనం చేసే ముందు, భోజనం చేసిన వెంటనే తినకూడదు. దీని వల్ల అనేక జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి కనీసం రెండు గంటల ముందు, ఆ తర్వాత తినాలి.

సాధారణంగా ఆరోగ్య నిపుణుల అభిప్రారయం ప్రకారం.. యాపిల్ రసం కంటే పండ్లు తీసుకోవడం ఎక్కువ ప్రయోజనకరమట. యాపిల్ తినడం వల్ల ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. కానీ జ్యూస్ తయారు చేసి, అందులో చక్కెర జోడించి తాగడం వల్ల కేలరీలు గణనీయంగా పెరుగుతాయి.





























