- Telugu News Photo Gallery Cinema photos Know Raashi Khanna Said She Wants IAS Officer In School Days
Tollywood: కలెక్టర్ కావాల్సిన అమ్మాయి.. అనుకోకుండా సినిమాల్లోకి.. టాలీవుడ్ హీరోయిన్.. ఇప్పుడు..
సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్లకు సంబంధించిన ప్రతి చిన్న విషయం తెగ వైరలవుతుంది. ముఖ్యంగా తారల పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఆమె క్రేజీ హీరోయిన్. కానీ ఇప్పుడు బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ?
Updated on: Jan 25, 2025 | 9:04 PM

చిన్నప్పుడు స్కూల్లో టాపర్. ఉన్నత చదువులు చదివి IAS కావాలని ఎన్నో కలలు కంది. కానీ అనుహ్యంగా సినిమాల్లోకి అడుగుపెట్టింది. నటనపై ఆసక్తితో సినీరంగంవైపు అడుగులు వేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

దక్షిణాది సినీప్రియులకు పెద్దగా పరిచయం అవసరంలేని హీరోయిన్.. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనే హీరోయిన్ రాశీ కన్నా.

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్న రాశీ ఖన్నా.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన స్టార్ డమ్ అందుకోలేదు.

ఇన్నాళ్లు తెలుగులో అలరించిన రాశీ ఖన్నా ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తుంది. ఇటీవల ది సబర్మతి రిపోర్ట్ సినిమాతో హిందీ సినీప్రియులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.

నిజానికి రాశీ ఖన్నా ఐఏఎస్ కావాలనుకుందట. కానీ జరగలేదట. మధ్య తరగతి కుటుంబాల్లో పెరిగేవారు మంచి సేఫ్టీ ఉద్యోగం కావాలనుకుంటారని.. అందుకే తను కూడా ఐఏఎస్ కావాలనుకున్నానని.. కానీ హీరోయిన్ అయినట్లు తెలిపింది.





























