Guillain Barre Syndrome: మహారాష్ట్రను వణికిస్తున్న అరుదైన వ్యాధి.. పూణెలో వేగంగా పెరుగుతున్న కేసులు.. కేంద్రం అలర్ట్
వ్యాధి ఒక్కసారిగా పెరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఆరోగ్యశాఖ అధికారులు ఇంటింటికీ వెళ్లి వ్యాధి సోకిన వారిని గుర్తిస్తున్నారు. ముందస్తుగానే ప్రజల్లో అవగాహన కలిపిస్తోంది. ఇంతకీ గులియన్ బారే సిండ్రోమ్ ఎలా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయనేది ఇక్కడ తెలుసుకుందాం..

మహారాష్ట్రలోని పూణేలో అరుదైన వ్యాధి కలకలం రేపుతోంది. గులియన్ బారే సిండ్రోమ్ అనే నాడీ సంబంధిత వ్యాధి విజృంభిస్తోంది. ఈ వ్యాధి బారినపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఒక్క పూణేలోనే దాదాపు 73 మంది ఈ ప్రమాదకరమైన మెదడు వ్యాధి బారిన పడ్డారని సమాచారం..వీరిలో 47 మంది పురుషులు, 26 మంది స్త్రీలు ఉన్నారు. 14 మందిని వెంటిలేటర్లపై ఉంచినట్లు రాష్ట్ర ఆరోగ్య అధికారులు శుక్రవారం తెలిపారు. వ్యాధి ఒక్కసారిగా పెరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఆరోగ్యశాఖ అధికారులు ఇంటింటికీ వెళ్లి వ్యాధి సోకిన వారిని గుర్తిస్తున్నారు. ముందస్తుగానే ప్రజల్లో అవగాహన కలిపిస్తోంది. ఇంతకీ గులియన్ బారే సిండ్రోమ్ ఎలా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయనేది ఇక్కడ తెలుసుకుందాం..
గులియన్ బారే సిండ్రోమ్ కండరాల కదలికను నియంత్రించే నరాలను ప్రభావితం చేస్తుంది. ఇది కండరాల బలహీనత, కాళ్లు ,లేదా చేతుల్లో సంచలనాన్ని కోల్పోయేలా చేస్తుంది. మింగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారుతుంది. ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థ, నాడీ వ్యవస్థపై దాడి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే, ఈ వ్యాధి లక్షణాలు పరిశీలించినట్టయితే, కాళ్లు , చేతుల్లో బలహీనత మొదలువుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి దారి తీస్తుందని చెబుతున్నారు. ఇది సాధారణంగా సంక్రమణ తర్వాత అభివృద్ధి చెందుతుందని వివరించారు. అయితే, ఈ కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్నాయని తెలిసింది. .కానీ ఒకే సారి పూణెలో కేసుల సంఖ్య పెరగడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ కేసులలో ఎక్కువగా నగరంలోని సింహగర్ రోడ్ ప్రాంతంలో కనుగొన్నారు.
Guillain-Barré syndrome: An overview for student nurses
GBS is a rapidly progressing autoimmune condition in which the body’s immune system mistakenly attacks the peripheral nervous system.
Pathophysiology: 1. Triggering event GBS is often triggered by an infection or immune… pic.twitter.com/4uqmcA4CLt
— Dr Honey choudhary 🩺 (@Doctors__squad) January 2, 2025
అయితే, ఈ వ్యాధి ఒక వ్యక్తి నుండి మరొకరికి సోకదని చెబుతున్నారు.. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. ఇది కొత్తగా నిర్ధారణ అయిన వ్యాధి కాదు, దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు సూచించారు. అయితే, ఈ వ్యాధికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియదని కూడా చెప్పారు. పూణే మునిసిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగం బాధిత రోగుల నుండి సేకరించిన నమూనాలను పరీక్ష కోసం ICMR-NIVకి పంపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..