AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gomaya Ganapati Idols: ఇంటింటికి ఉచితంగా గోమయ గణపతి విగ్రహాలు పంపిణీ చేయనున్న మంత్రి కోడలు.. ఏయే తేదీల్లోనంటే

నిర్మల్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తీ ఏటా క్లిమామ్ సంస్థ, ఐకేఆర్ ఫౌండేషన్ ఆద్వ‌ర్యంలో ఉచిత గోమయ గణపతులను పంపిణీ చేస్తున్నట్లు అల్లోల గౌతంరెడ్డి, సేవ్ దేశీ కౌస్ క్యాంపెనర్, క్లిమామ్ వ్య‌వ‌స్థాప‌కురాలు అల్లోల దివ్యారెడ్డి తెలిపారు. గ‌త 8 ఏళ్లుగా పర్యావరణానికి హానిచేయని విధంగా గోమయం, ప‌సుపు, మ‌ట్టి, చింత గింజ‌లు, వేపాకు మిశ్ర‌మం, ఎండు గ‌డ్డి ఉపయోగించి గ‌ణేష్ ప్ర‌తిమ‌ల‌ను త‌యారు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు దివ్యా గౌతమి రెడ్డి. శాస్త్రినగర్ లోని మంత్రి..

Gomaya Ganapati Idols: ఇంటింటికి ఉచితంగా గోమయ గణపతి విగ్రహాలు పంపిణీ చేయనున్న మంత్రి కోడలు.. ఏయే తేదీల్లోనంటే
Distribution Of Gomaya Ganapati Idols
Naresh Gollana
| Edited By: Srilakshmi C|

Updated on: Sep 14, 2023 | 5:43 PM

Share

నిర్మల్‌, సెప్టెంబర్ 14: నిర్మల్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తీ ఏటా క్లిమామ్ సంస్థ, ఐకేఆర్ ఫౌండేషన్ ఆద్వ‌ర్యంలో ఉచిత గోమయ గణపతులను పంపిణీ చేస్తున్నట్లు అల్లోల గౌతంరెడ్డి, సేవ్ దేశీ కౌస్ క్యాంపెనర్, క్లిమామ్ వ్య‌వ‌స్థాప‌కురాలు అల్లోల దివ్యారెడ్డి తెలిపారు. గ‌త 8 ఏళ్లుగా పర్యావరణానికి హానిచేయని విధంగా గోమయం, ప‌సుపు, మ‌ట్టి, చింత గింజ‌లు, వేపాకు మిశ్ర‌మం, ఎండు గ‌డ్డి ఉపయోగించి గ‌ణేష్ ప్ర‌తిమ‌ల‌ను త‌యారు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు దివ్యా గౌతమి రెడ్డి. శాస్త్రినగర్ లోని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో 16, 17 తేదీల్లో ఉచితంగా గోమయ గణనాథులను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి క‌మిటీ స‌భ్యులు వ‌చ్చి ఈ గోమ‌య వినాయ‌క ప్ర‌తిమ‌ల‌ను తీసుకెళ్ళి, ప్ర‌తిష్టించాల‌ని కోరారు. మంత్రి క్యాంప్ కార్యాల‌యంలో పేర్లను నమోదు చేసుకుని వీటిని తీసుకెళ్లవచ్చని తెలిపారు. గోమయ గణపతులను మంత్రి కేటీఆర్ కు, ఎంపి సంతోష్ రావు , ఎమ్మెల్సీ కవితలకు బహుకరించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోడలు సేవ్ దేశీ కౌస్ క్యాంపెనర్, క్లిమామ్ వ్య‌వ‌స్థాప‌కురాలు అల్లోల దివ్యారెడ్డి. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా ఎకో ప్రెండ్లీ గోమ‌య గ‌ణ‌ప‌తి ప్ర‌తిమ‌ల త‌యారీ, పంపిణీ, దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం చేపట్టిన ప్రచార కార్యక్రమాలను వారికి వివరించారు దివ్యారెడ్డి.

గోమయంలో సాక్షాత్తూ లక్ష్మీదేవి కొలువు ఉంటుందని… పూజాదికాల్లో, ఔషధాల్లో గోమయం (ఆవు పేడ) ప్రాధాన్యం ఎంతో ఉందని తెలిపారు దివ్యారెడ్డి అల్లోల. గోమయంతో గౌరీ తనయుణ్ని రూపొందించి పెద్ద ఎత్తున పంపిణి చేయనున్నట్టలు తెలిపారు క్లిమామ్‌ సంస్థ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యారెడ్డి. ప్రకృతి పండుగను పర్యావరణ హితంగా నిర్వహించాలనే సంకల్పంతో 8 ఏంట్లుగా గోమయ గణపయ్య ప్రతిమలను తయారు చేయించి, వాడవాడలా పంచుతున్నారామె. నాసిక్‌లోని 17వ శతాబ్దం నాటి ఆలయంలో గోమయ ఆంజనేయ స్వామి విగ్రహం స్ఫూర్తితో ఆవు పేడతో గణపతి విగ్రహాలు తయారు చేయాలని భావించిన దివ్యారెడ్డి… 2017 నుంచీ ఏటా లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ గోమయ మూర్తులను తయారు చేయించి ఉచితంగా పంపిణి చేస్తున్నారు.

ఒక అడుగు నుంచి ఆరు అడుగుల ఎత్తున్న విగ్రహాలను వివిధ రూపాల్లో రూపొందిస్తున్నారు. పసుపు, నిమ్మ ఆకుల ముద్ద, మట్టి, చింతగింజల పొడిని గోమయంలో కలిపి, ఈ మిశ్రమంతో వినాయక ప్రతిమలు చేస్తున్నారు. ఈ వినాయకులను నిమజ్జనం చేయడం వల్ల జలజీవాలకు ఆహారం లభించడంతో పాటు, ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా నీటిలో కలవడంతో వాగులు , వంకలు, చెరువులు శుద్ధి అవుతాయని చెప్తున్నారు దివ్యారెడ్డి. ఇంట్లో నిమజ్జనం చేసి ఆ నీటిని మొక్కలకు పోస్తే మంచి ఎరువుగానూ ఉపయోగపడుతుందంటున్నారు ఆమె. ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే మంటపాలు, దేవాలయాలు, విద్యాలయాలు, కార్యాలయాలతో పాటు ఇంటింటా గోమయ వినాయకులను ప్రతిష్టించాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

రసాయనాలు వాడి వినాయకుల ప్రతిమలను తయారు చేయడం వల్ల పర్యావరణానికి కీడు కలుగుతుందని.. ప్రకృతిని కాపాడే లక్ష్యంతో ఏటా గోమయ, మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నామని… ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున గోమయ గణపతులను పంపిణి చేయనున్నట్టు తెలిపారు అల్లోల దివ్యారెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.