MLC Kavitha: మోదీ నోటీసు అందింది.. దానిని సీరియస్‌గా తీసుకోను: ఎమ్మెల్సీ కవిత
ఈడీ నోటీసులపై MLC కల్వకుంట్ల కవిత రెస్పాండ్ అయ్యారు. తనకు మోదీ నోటీసు వచ్చిందని సెటైర్ వేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వచ్చిన నోటీసును లైట్ తీసుకుంటానని చెప్పారు. అసలు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తనకు అందిన నోటీసును పార్టీ లీగల్ టీమ్‌కు ఫార్వార్డ్ చేశానని.. వారి సూచనల ప్రకారం ముందుకెళ్తామన్నారు. ఏదో టీవీ సీరియల్‌లా ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎలక్షన్స్ వచ్చాయని.. మళ్లీ ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కూడా ఈ నోటీసును సీరియస్‌గా తీసుకోవద్దని ఎమ్మెల్సీ కవిత కోరారు.
ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత సెటైర్లు వేశారు. మోదీ నోటీసు వచ్చిందని.. దానిని తెలంగాణ ప్రజలు సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదన్నారు. ఈడీ నోటీస్ పార్టీ లీగల్ టీమ్‌కు పంపించానని.. లీగల్ టీమ్ ఇచ్చే సలహా మేరకు నడుచుకుంటా చెప్పారు. లిక్కర్ కేసు ఏడాదికాలంగా సీరియల్‌లా సాగుతూనే ఉందన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కదా.. నోటీస్ ఎపిసోడ్ మామూలే.. అని ఆమె పంచ్‌లు వేశారు. బీజేపీ రాజకీయ కక్షతో ఇలా చేస్తుందని మొదట్నుంచి చెబుతున్నామన్నారు కవిత. తెలంగాణ ప్రజలు కూడా దీనిని సీరియస్‌గా తీసుకోరని కవిత స్పష్టం చేశారు.
వైరల్ వీడియోలు
Latest Videos