కంపెనీ అనుమతి ఒకచోట.. ఉత్పత్తులు మరోచోట! అడ్డగోలు వ్యాపారం చేస్తోన్న డెయిరీపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడి
కాసులకు కక్కుర్తి పడుతున్న వ్యాపారులు ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు. పడుతున్నారు. డైయిరీ ఉత్పత్తికి అనుమతి ఒకచోట... ఉత్పత్తులు మరోచోట. ఎలాంటి అనుమతులు లేకుండా పాల ఉత్పత్తులను చేస్తున్న విఎన్ఆర్ డైరీ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో..
నల్గొండ, సెప్టెంబర్ 6: కాసులకు కక్కుర్తి పడుతున్న వ్యాపారులు ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు. పడుతున్నారు. డైయిరీ ఉత్పత్తికి అనుమతి ఒకచోట… ఉత్పత్తులు మరోచోట. ఎలాంటి అనుమతులు లేకుండా పాల ఉత్పత్తులను చేస్తున్న విఎన్ఆర్ డైరీ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో ఆరు లక్షల రూపాయల విలువైన పాల ఉత్పత్తులను సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే…
నల్గొండ జిల్లా కేతపల్లి మండలం ఇనుపాములలో పాల ఉత్పత్తుల పేరుతో విఎన్ఆర్ అనే పాల డైయిరీ కంపెనీ ఆరు నెలల క్రితం ప్రారంభమైంది. విఎన్ఆర్ సంస్థ సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కొమరబండ లో డైరీ కంపెనీని ప్రారంభించేందుకు అనుమతులు తీసుకుంది. కానీ అక్కడ కంపెనీని ప్రారంభించకుండా కేతేపల్లి మండలం ఇనుపాములలో పాల ఉత్పత్తులను ప్రారంభించింది. ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చేస్తున్న ఉత్పత్తులపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో నల్లగొండ జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ, పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. నాలుగు గంటలకు పైగా అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కంపెనీలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పెద్ద మొత్తంలో పాలతో పాటు ఇతర ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. పాలు, ప్రోటీన్ బైండర్స్ కు చెందిన 10 రకాల శాంపిల్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించారు. ఈ శాంపిల్స్ ను హైదరాబాదులోని ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ కు పంపించారు. సుమారు 6 లక్షల రూపాయల విలువైన పాలు, ప్రోటీన్ బైండర్స్ ను అధికారులు సీజ్ చేశారు. కంపెనీలో పాల ఉత్పత్తుల్లో శుభ్రత పాటించలేదని అధికారులు నిర్ధారించారు.
వీఎన్ఆర్ డైయిరీ ప్రోడక్ట్స్ కు ఎలాంటి అనుమతి లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. పాల ఉత్పత్తుల లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్నారని అధికారులు చెప్పారు. పాల ఉత్పత్తులకు సంబంధించి సేకరించిన శాంపిల్స్ ల్యాబ్ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని నల్లగొండ జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి తెలిపారు. శుభ్రత లేకుండా పాల ఉత్పత్తులు తయారీకి సంబంధించి నాలుగు రకాల నోటీసులు ఇచ్చామని చెప్పారు. పాల ఉత్పత్తుల్లో నాణ్యత ప్రమాణాలు లేకుంటే కంపెనీ సీజ్ చేస్తామని ఆమె చెప్పారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా మార్కెట్ లోకి వచ్చే పాల ఉత్పత్తుల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.