Hyderabad: భాగ్యనగరంలో మరో బిగ్‌డే.. ఒకే రోజు రెండు పండుగలు.. పోలీసులకు పెద్ద పరేషాన్..
సెప్టెంబర్ 19న వినాయక నవరాత్రులు ప్రారంభం.. 28న నిమజ్జనం. ఈమేరకు భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ ఇప్పటికే తేల్చేసింది. అయితే అదే రోజు మిలాద్- ఉన్-నబీ పండుగ కూడా వచ్చింది. ఈ సందర్భంగా ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తారు. నిమజ్జనం సందర్భంగా హిందువులు కూడా శోభాయాత్రలు నిర్వహిస్తారు. రెండు మతాలకు సంబంధించిన ఊరేగింపులు ఒకే సమయంలో జరిగితే... ఒకరికొకరు ఎదురు పడితే... శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్నది పోలీసులకొస్తున్న ఫికర్.
Hyderabad: భిన్నత్వంలో ఏకత్వం.. ఏకత్వంలో భిన్నత్వం.. అనేది భారతీయ ఆత్మ నినాదం. ఆలిన్ వన్, వన్ ఇన్ ఆల్ అనే ఈ రేరెస్ట్ స్లోగన్‌కి మన హైదరాబాద్‌ని కేరాఫ్‌గా చెప్పుకుంటారు. భిన్న మతాల సమ్మేళనంగా.. ముఖ్యంగా హిందూ-ముస్లిం మతస్థుల భాయ్‌భాయ్ సంస్కృతికి అడ్డాగా గర్వపడతాం కూడా. కానీ.. ఈ పరమత సహనాన్ని పరీక్ష పెట్టేలా కొన్ని సందర్భాలు అడ్డొస్తాయి.. రెండు మతాలకు సంబంధించిన రెండు పర్వదినాలు ఒకేరోజు వస్తే.. వాటికి సంబంధించిన సంబరాలు ఒకే ప్రాంతంలో నిర్వహించాల్సి వస్తే.. పోలీసులకైతే పెద్ద పరేషానే.
ఈనెల 28న గణేశ్ శోభాయాత్ర.. అదేరోజు మిలాద్ ఉల్ నబీ ర్యాలీ. ఈ సంక్లిష్ట సమయంలో రెండు మతాల వాళ్ల అలయ్‌బలయ్ సాధ్యమేనా.. తొమ్మిదేళ్లుగా మతకల్లోలాలే లేని భాగ్యనగరంలో.. ఇటువంటి టెస్టింగ్ టైమ్స్ వస్తే పరిస్థితి ఏంటి.. ఈ సమస్యను ఎలా సర్దెయ్యాలన్న పనిలోనే బిజీగా ఉన్నారు పోలీసులు.
సెప్టెంబర్ 28.. భాగ్యనగరంలో మరో బిగ్‌డే. రెండు ప్రధాన ఆధ్యాత్మిక సంబరాలకు కుదిరిన ఉమ్మడి తారీఖు ఇది. గణేష్ నిమజ్జనం, మిలాద్- ఉన్-నబీ పండుగలు ఒకే రోజు వస్తున్నాయి. ఇదే ఇప్పుడు నగర వాసుల్ని, పోలీసుల్ని టెన్షన్ పెట్టిస్తున్న అంశం.
సెప్టెంబర్ 19న వినాయక నవరాత్రులు ప్రారంభం.. 28న నిమజ్జనం. ఈమేరకు భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ ఇప్పటికే తేల్చేసింది. అయితే అదే రోజు మిలాద్- ఉన్-నబీ పండుగ కూడా వచ్చింది. ఈ సందర్భంగా ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తారు. నిమజ్జనం సందర్భంగా హిందువులు కూడా శోభాయాత్రలు నిర్వహిస్తారు. రెండు మతాలకు సంబంధించిన ఊరేగింపులు ఒకే సమయంలో జరిగితే… ఒకరికొకరు ఎదురు పడితే… శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్నది పోలీసులకొస్తున్న ఫికర్.
ఇదే సందర్భంలో మజ్లిస్ నేత ఎంపీ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు పండగలు ఒకేరోజు రావటంతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో లా అండ్ అర్డర్ అదుపు తప్పకుండా తమ వంతు ప్రయత్నం తామూ చేస్తామన్నారు.
అవాంఛనీయ ఘటనలు జరక్కుండా యాక్షన్ ప్లాన్ చేపట్టారు పోలీసులు. రెండు మతాల పెద్దలతో, మధ్యస్థులతో కలిసి 300 మంది సభ్యులతో పీస్ కమిటీ ఏర్పాటైంది. ఇటీవలే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శాంతి కమిటీతో సమావేశమయ్యారు. మిలాద్-ఉన్-నబీ ర్యాలీని వాయిదా వేసేందుకు పీస్ కమిటీ సభ్యుల్ని ఒప్పించారు. అటు… గణేష్ ప్రతిమలు ప్రతిష్ఠించిన 3, 6, 9 రోజుల్లో ఎప్పుడైనా.. నిమజ్జనం చేసుకోవాలని, 9వ రోజున రద్దీ నియంత్రణకు తోడ్పడాలని కోరారు.
28న మిలాద్-ఉన్-నబీ ర్యాలీని రద్దు చేస్తూ.. SUFI నిర్ణయం తీసుకోవడంతో రెండు పండగలు ప్రశాంత వాతావరణంలో ముగుస్తాయన్న భరోసా కలిగింది. దీంతో పోలీసులు ముందస్తుగానే ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. బందోబస్తు విషయంలో రాజీ పడబోమంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..