Telangana Politics: పరేడ్ గ్రౌండ్ ఎవరిది..? ముందే దరఖాస్తు చేశామంటున్న కాంగ్రెస్.. అధికారిక కార్యకమం అంటున్న బీజేపీ
ఈనెల 17వ తేదీన తెలంగాణ విమోచన దినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని, అంతేకాకుండా పొలిటికల్ మైలేజీ పొందాలని కాషాయం నేతలు భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలను గత యేడాది నిర్వహించారు. సాంస్కృతి కార్యక్రమాలు, బైరాన్ పల్లి లాంటి ఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించే విధంగా ఎగ్జిబిషన్ నిర్వహించారు.
సెప్టెంబర్ 17వ తేదీకి కౌండ్ డౌన్ స్టార్ట్ అయ్యింది. సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడి రాజుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం కేంద్రంగా తెలంగాణ పాలిటిక్స్ ఎప్పుడు లేని విధంగా కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మూడు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటం, మరో వైపు విమోచన దినోత్సవం సమీపిస్తుండటంతో ఆ తేదీన తమ బలబలాలను చూపించుకునేందుకు ఆయా పార్టీలు సన్నద్దమవుతున్నాయి.
అయితే ఈనెల 17వ తేదీన తెలంగాణ విమోచన దినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని, అంతేకాకుండా పొలిటికల్ మైలేజీ పొందాలని కాషాయం నేతలు భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలను గత యేడాది నిర్వహించారు. సాంస్కృతి కార్యక్రమాలు, బైరాన్ పల్లి లాంటి ఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించే విధంగా ఎగ్జిబిషన్ నిర్వహించారు. గత యేడాది తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
అదే సంప్రదాయాన్ని ఈ యేడాది కూడా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల యేడాది కావడంతో.. ఈ సారి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజల్లోకి వెళ్లెలా ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్ వేదికగా నిర్వహించే ఈ సభకు కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఎవరిని రప్పించాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు ఈ నెల 16,17, 18 వ తేదీల్లో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమైంది.
పరేడ్ గ్రౌండ్ లో సభకు అనుమతించాలని కోరుతూ.. కంటోన్మెంట్ అధికారులను లేఖను కూడా రాశారు. సభా స్థలాన్ని స్వయంగా రేవంత్ రెడ్డి పరిశీలించారు. సడెన్ గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. పరేడ్ గ్రౌండ్ లోనే కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోనే తెలంగాణ విమోచన వేడుకలను నిర్వహిస్తామని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ షాక్ కు గురైంది. తాము ముందుగా సభ నిర్వహణ అనుమతి కోసం లేఖ రాసిన నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ ను తమకే కేటాయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మొత్తానికి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో వేదికపై నుంచి ఎన్నికల శంఖారావం పూరించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ వేదిక మార్చుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. ఇప్పటికే డీలా పడ్డ కమలనాథులు.. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించి ఏ మేరకు మైలేజీ సాధిస్తారో అన్నది వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి