Telangana: హైదరాబాద్‌లో రూ.1600 కోట్లతో డిస్టిక్ కూలింగ్ సిస్టం ఏర్పాటు.. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే ఆసియాలోనే అత్యుత్తమ నగరంగా..

ప్రపంచ ప్రఖ్యాత శీతలీకరణ కార్యకలాపాల సంస్థ (cooling utility player) తబ్రీడ్ (Tabreed) తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ప్రణాళికను ప్రకటించింది. తంబీద్ సంస్థ వాణిజ్య, ఇతర రంగాల శీతలీకరణ కార్యక్రమాలకు పేరుగాంచింది. ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో భాగంగా చేపట్టే కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆయా పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు అవసరమైన శీతలీకరణ..

Telangana: హైదరాబాద్‌లో రూ.1600 కోట్లతో డిస్టిక్ కూలింగ్ సిస్టం ఏర్పాటు.. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే ఆసియాలోనే అత్యుత్తమ నగరంగా..
District Cooling System In Telangana
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 06, 2023 | 5:09 PM

హైదరాబాద్‌, సెప్టెంబర్ 6: ప్రపంచ ప్రఖ్యాత శీతలీకరణ కార్యకలాపాల సంస్థ (cooling utility player) తబ్రీడ్ (Tabreed) తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ప్రణాళికను ప్రకటించింది. తంబీద్ సంస్థ వాణిజ్య, ఇతర రంగాల శీతలీకరణ కార్యక్రమాలకు పేరుగాంచింది. ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో భాగంగా చేపట్టే కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆయా పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు అవసరమైన శీతలీకరణ మౌలిక వసతుల) నిర్మాణం కోసం దాదాపు 1600 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టి ఆయా పారిశ్రామిక పార్కులకు శీతలీకరణ వసతులను అందించనున్నది. సంస్థ హైదరాబాద్ ఫార్మసిటీ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక పార్కుల అవసరాల మేరకు ఈ కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయనున్నది. ఈ మౌలిక వసతుల కల్పన వలన పారిశ్రామిక పార్కులకు అవసరమైన కూలింగ్, స్టోరేజ్ అవసరాలను తీర్చేందుకు అవకాశం కలుగుతుంది. ఈ మేరకు సంస్థ లక్ష 25 వేల రిఫ్రిజిరేషన్ టన్నుల కూలింగ్ మౌలిక వసతులను తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుంది. దీని వలన 24 మిలియన్ టన్నుల కార్బన్ డై యాక్సైడ్ ఉద్గారాలను తగ్గించేందుకు వీలు కలుగుతుంది. ఈ లక్ష్యం పూర్తయితే ఆసియా ఖండంలోనే జీవించేందుకు, పని చేసేందుకు అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ అగ్రస్థానంలో నిలవబోతున్నది.

ఈ సంస్థతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ కూలింగ్ సొల్యూషన్స్ మౌలిక వసతుల వలన బహుముఖ ప్రయోజనాలు కలగనున్నాయి. ఒకవైపు పర్యావరణ పరిరక్షణ కాలుష్య నియంత్రణ లక్ష్యాల మేరకు దాదాపు 6800 గిగా వాట్ల కరెంటుతో పాటు 41,600 మెగా లీటర్ల నీటిని పారిశ్రామిక రంగంలో పొదుపు చేసేందుకు అవకాశం కలుగుతుంది. దీంతోపాటు ఆరు పాయింట్ రెండు మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను అరికట్టేందుకు వీలు కలుగుతుంది. ప్రభుత్వం ఈ సంస్థతో కలిసి చేపడుతున్న ఈ మౌలిక వసతుల కల్పన వలన ముఖ్యంగా ఫార్మా రంగంలో ఉన్న బల్క్ డ్రగ్ తయారీ కేంద్రాలకు స్వచ్ఛమైన హరితమైన పరిష్కారాలు లభించే అవకాశం ఏర్పడుతుంది.

ఈ మేరకు తబ్రీద్ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైబరాబాద్ వంటి కమర్షియల్ డిస్ట్రిక్ట్ (నిర్దేశిత వాణిజ్య ప్రాంతాలు) తో పాటు రానున్న ప్రాంతాలలోనూ 2 మెగావాట్ల మేర విద్యుత్ డిమాండ్ ను తగ్గించేలా కార్బన్ డయాక్సైడ్ య ఉద్గారాలను తగ్గించేలా సుదీర్ఘకాలం పాటు ఈ కూలింగ్ పరిష్కారాలను అందించేలా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో సుదీర్ఘకాలంలో హైదరాబాద్ నగరంలో కాలుష్యము మరియు ఉష్ణోగ్రతలు తగ్గి అత్యుత్తమ నగరాలకు కావలసిన అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆశాభావాన్ని ఈ సందర్భంగా సంస్థ వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి

తబ్రీద్ సంస్థ సీఈఓ (ముఖ్య కార్యనిర్వహణ అధికారి) ఖలీద్ అల్ మర్జుకి ప్రతినిధి బృందం ఈరోజు మంత్రి కే తారక రామారావు తో దుబాయిలో జరిగిన సమావేశంలో ఈ మేరకు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హైదరాబాద్ ఫార్మసిటీ సీఈవో శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ హితం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో భారీగా కొనసాగుతున్న పారిశ్రామికీకరణ, వేగంగా విస్తరిస్తున్న వ్యాపార వాణిజ్య ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని సస్టైనబుల్ భవిష్యత్తు కోసం ఈరోజు జరిగిన అవగాహన ఒప్పందం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తూ, ప్రస్తుత మరియు భవిష్యత్తు పరిస్థితులకు అనుగుణంగా స్థానిక పరిస్థితులకు అనుకూలంగా అమలు చేసేందుకు వీలైన డిస్టిక్ కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తక్కువ విద్యుత్ శక్తిని ఉపయోగించుకునే cooling పరిష్కారాలను, కూల్ రూఫ్ పాలసీ వంటి విధానాల ద్వారా తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని అందుకునే దిశగా ముందుకు పోతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ఈ అవగాహన ఒప్పందం తెలంగాణ రాష్ట్ర మాత్రమే కాకుండా భారత దేశ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని సంస్థ చైర్మన్ ఖాలిద్ అబ్దుల్లా అల్ ఖుబాసి తెలిపారు. తమ సంస్థకు డిస్ట్రిక్ట్ కూలింగ్ రంగంలో ఉన్న అపారమైన అనుభవము సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగిస్తామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కాలుష్య రహిత ఫార్మసిటికల్ క్లస్టర్ హైదరాబాద్ ఫార్మాసిటీ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర పారిశ్రామిక పార్కులు, వాణిజ్య ప్రాంతాలకు అవసరం అయినా అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన తమ కూలింగ్ టెక్నాలజీలను అందిస్తామన్నారు. పారిశ్రామిక మరియు వాణిజ్య రంగాలు కలిగించే కాలుష్యానికి ప్రధాన కారణం అవి వాడే కూలింగ్ టెక్నాలజీలు అని వాటి ద్వారానే భారీ ఎత్తున కార్బన్ ఉద్గారాలు వెలువడతాయని అయితే ఈరోజు జరిగిన అవగాహన ఒప్పందం మేరకు ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయి కూలింగ్ పరిష్కారాలను తెలంగాణకు తీసుకురావడం ద్వారా నెట్ జీరో ఉదారాల విషయంలో తెలంగాణ తన లక్ష్యాన్ని అందుకుంటున్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈరోజు తమ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం ఇండియా హెడ్ అతుల్ బగాయి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం పైన ప్రశంసలు కురిపించారు. COP28 ద్వారా అంతర్జాతీయ కూలింగ్ ప్లెడ్జ్ కార్యక్రమాన్ని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం చేపట్టిందని ఇందులో భాగంగా ప్రపంచ దేశాలని అత్యుత్తమ కూలింగ్ విధానాల ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యం మేరకు పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయన్నారు. దిశగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్..
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్..
డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!