AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: డబ్బుల కోసం పుట్టక ముందే బిడ్డను బేరం పెట్టిన తల్లి.. చిన్నారి కోసం ఇద్దరి మధ్య గొడవతో వెలుగులోకి

అంబేద్కర్ కాలనీకి చెందిన గొసంగి దేవి, భర్త ఇద్దరు పిల్లలతో ఉంటుంది. భర్త కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే దేవి గర్భం దాల్చగా బిడ్డను పోషించే స్తోమత లేకపోవడంతో పుట్టిన వెంటనే బిడ్డను అమ్మాలని భావించింది. ఇదే విషయాన్ని దుబ్బ ప్రాంతంలోని UPHC లో పనిచేసే సలుంకే జయ కి తెలిపింది.

Telangana: డబ్బుల కోసం పుట్టక ముందే బిడ్డను బేరం పెట్టిన తల్లి.. చిన్నారి కోసం ఇద్దరి మధ్య గొడవతో వెలుగులోకి
Mother Sold Her Child
Prabhakar M
| Edited By: |

Updated on: Sep 06, 2023 | 4:14 PM

Share

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన రెండు రోజుల బాబు ను విక్రయించేందుకు యత్నించింది. విషయం తెలుసుకున్న 3 టౌన్ పోలీసులు నిందులను అదుపులోకి తీసుకున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసిపి కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన గొసంగి దేవి, భర్త ఇద్దరు పిల్లలతో ఉంటుంది. భర్త కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే దేవి గర్భం దాల్చగా బిడ్డను పోషించే స్తోమత లేకపోవడంతో పుట్టిన వెంటనే బిడ్డను అమ్మాలని భావించింది. ఇదే విషయాన్ని దుబ్బ ప్రాంతంలోని UPHC లో పనిచేసే సలుంకే జయ కి తెలిపింది. డబ్బులకు ఆశపడిన జయ నాగారంకు చెందిన అమీనా బేగంకు, ఆటోనగర్ కు చెందిన షబానా బేగంలకు బిడ్డను అమ్మేందుకు బేరసారాలు మొదలుపెట్టింది. ఆడబిడ్డ పుడితే లక్ష రూపాయలు అని, మగబిడ్డ పుడితే లక్షన్నర రూపాయలని రేటు నిర్ణయించింది. అమీనా బేగం, షబానా బేగంల వద్ద దేవి రూ.5 వేల చొప్పున అడ్వాన్స్ తీసుకుంది. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గోసంగి దేవి మగబిడ్డకు జన్మనివ్వడంతో డెలివరి ఖర్చు రూ.20 వేలు షబానా బేగం కట్టింది.

ఈ నెల 3న సోమవారం సాయంత్రం అంబేద్కర్ కాలనీ చౌరస్తాలోని పాత థియేటర్ వద్ద గోసంగి దేవి, ఆశా వర్కర్ సలూరికే జయలు గొడవపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మూడవ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని వారిని స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పసి కందును విక్రయించేందుకు యత్నించిన తల్లి గోసంగి దేవి, ఆశ వర్కర్ సలూరికే జయ, విక్రయించేందుకు ప్రయత్నించిన అమీనా బేగం, షబానా బేగంలను పోలీసులు అరెస్టు చేశారు. పసికందును ఐసిడిఎస్ సిబ్బందికి అప్పజెప్పి, నలుగురు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు ఏసిపి కిరణ్ కుమార్ తెలిపారు. వారి నుంచి రెండు సెల్ ఫోన్లు, 20 వేల నగదును స్వాధీన పరుచుకున్నా మని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్
టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్
ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్
ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్
మీ ఇంట్లో 100గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుందో తెలుసా..?
మీ ఇంట్లో 100గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుందో తెలుసా..?
రైతు భరోసాకు ప్రభుత్వం కొత్త రూల్స్.. రైతులందరికీ..
రైతు భరోసాకు ప్రభుత్వం కొత్త రూల్స్.. రైతులందరికీ..
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు:కిషన్ రెడ్డి
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు:కిషన్ రెడ్డి
నార్మల్ పెట్రోల్ Vs పవర్ పెట్రోల్.. ఈ రెండిటిలో మీ వాహనానికి
నార్మల్ పెట్రోల్ Vs పవర్ పెట్రోల్.. ఈ రెండిటిలో మీ వాహనానికి
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఈ ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లు
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఈ ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లు
లిఫ్టులో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక అసలు సీక్రెట్‌
లిఫ్టులో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక అసలు సీక్రెట్‌
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్
వేసవి వేడితోనూ హార్ట్ స్ట్రోక్.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
వేసవి వేడితోనూ హార్ట్ స్ట్రోక్.. ఈ జాగ్రత్తలు తీసుకోండి