AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: జంట జలాశయాలకు భారీగా వచ్చి చేరిన వరద నీరు.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

గత 3 రోజుల నుండి కురిసిన భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతలు నుండి వరద నీరు జంట జలాశయాలకు పోటెత్తింది. వికారాబాద్, పరిగి, చేవెళ్ల, శంకర పల్లి  వంటి ప్రాంతాలలో భారీ వర్షం కురవడంతో గండిపేట చెరువు తో పాటు  హిమాయత్ సాగర్ కు భారీ వరద నీరు చేరింది.. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.5 అడుగులు కాగా ప్రస్తుతం 1763. 9 అడుగుల కు చేరుకుంది.

Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Sep 06, 2023 | 1:24 PM

Share

గత మూడు రోజులుగా ఎగువ ప్రాంతాలతో సహా హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు జంట జలశయాలు అయినటువంటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరింది.. రెండు జలాశయాలు కలిపి 12 గేట్లు ఎత్తిన రెవెన్యూ అధికారులు.. 5,500 పైగా క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసారు.. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.

గత 3 రోజుల నుండి కురిసిన భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతలు నుండి వరద నీరు జంట జలాశయాలకు పోటెత్తింది. వికారాబాద్, పరిగి, చేవెళ్ల, శంకర పల్లి  వంటి ప్రాంతాలలో భారీ వర్షం కురవడంతో గండిపేట చెరువు తో పాటు  హిమాయత్ సాగర్ కు భారీ వరద నీరు చేరింది.. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.5 అడుగులు కాగా ప్రస్తుతం 1763. 9 అడుగుల కు చేరుకుంది. నాలుగు వేల క్యూసెక్కుల ఇన్ ప్లో హిమాయత్ సాగర్ కు రాగా 6 గేట్లను ఎత్తి 4120 క్యూసెక్కుల వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. ఉస్మాన్ సాగర్ కు వరద నీరు పోటెత్తడంతో 2,200 క్యూసెక్కుల వరద నీరు ఇన్ ప్లో ఉండగా.. 2028 క్యూసెక్కుల వరద నీటిని ఆరు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి మూసి నదిలోకి విడుదల చేశారు.

ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790.9. ప్రస్తుత నీటిమట్టం 1789.9 అడుగులకు చేరుకుంది. దీంతో లోతట్టు ప్రాంతాలైన పురానాపూల్, జియాగూడ, అత్తాపూర్, లంగర్ హౌస్ వంటి మూసి పరివాహక ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు. ఈ మేరకు అధికారులు అంతా కలిసి డీసీపీ జగదీశ్వర్ రెడ్డి .. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళమని సూచించారు. అంతేకాదు సర్వీస్ రోడ్లను కూడా పూర్తిగా మూసివేసారు. ప్రజలకు ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా వెంటనే 100 నెంబర్ కి సమాచారం ఇవ్వాలని రాజేంద్రనగర్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అర్ధ రాత్రి సమయంలో నైనా సరే సమాచారం ఇవ్వవచ్చని పేర్కొన్నారు. భారీ వర్షాలు కురిసినా.. వరద నీరు భారీగా చేరుకున్నా ..  ఎలాంటి సమస్య ఉన్న వెంటనే  తమకు సమాచారం ఇవ్వాలని స్తానికులు విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే