AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: నాగ్ చెప్పింది నిజమేగా.. లోపం ఎక్కడుందో మరి..?

Nagarjuna: నాగ్ చెప్పింది నిజమేగా.. లోపం ఎక్కడుందో మరి..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 23, 2026 | 10:42 PM

Share

సినిమా రిలీజ్ డేట్లు ప్రకటించి వాయిదా వేయడం టాలీవుడ్‌లో సాధారణంగా మారిందని హీరో, నిర్మాత నాగార్జున వ్యాఖ్యానించారు. విడుదలకు రెండు వారాల ముందే ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉండాలని, చివరి నిమిషం వరకు మార్పులు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. హాలీవుడ్‌లో భారీ సినిమాలు అనుకున్న తేదీకే విడుదలవుతున్నప్పుడు, మన ఇండస్ట్రీ కూడా అదే క్రమశిక్షణ పాటించాలని సూచించారు.

సినిమా రిలీజ్ డేట్ చెప్తారు కానీ అది చెప్పిన టైమ్‌కు రాదు.. షూటింగ్ అయిపోయిందంటారు కానీ ఇచ్చిన డేట్‌కు విడుదలవ్వదు.. బెటర్ ఔట్ పుట్ అంటారు చివరి నిమిషం వరకు ఉరుకులు పరుగుల మీద పని చేస్తారు. ఓ పక్క హాలీవుడ్‌లో వేల కోట్ల సినిమాలు ఏడాది ముందే రెడీ అవుతుంటే.. మన సినిమాలెందుకిలా కన్ఫ్యూజ్ అవుతున్నారు..? అసలు కారణమేంటి..? నాగార్జున చెప్పిన దానిపై మనోళ్లు ఆలోచిస్తారా..? వింటున్నారుగా నాగార్జున ఏమంటున్నారో..? ఇక్కడ మాట్లాడుతున్నది నటుడు నాగ్ కాదు నిర్మాత నాగార్జున. దశాబ్ధాల అనుభవం ఉన్న నిర్మాతగా ఇండస్ట్రీ మారిపోతున్న తీరు గురించి ఓపెన్ అయిపోయారు నాగ్. గతంలోనే చిరంజీవి, బాలయ్య లాంటి సీనియర్స్ ఈ రిలీజ్ డేట్స్ గురించి మాట్లాడారు. ఇప్పుడు నాగార్జున సైతం చెప్పిన తేదీకి సినిమాలు విడుదల చేయకపోవడంపై చురకలంటించారు. కాస్త ఆలోచిస్తే.. నాగార్జున చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. సినిమా రిలీజ్ డేట్ ఏడాది ముందే చెప్తారు కానీ చేయరు. అదేంట్రా అంటే రేపు రిలీజ్ అనగా ముందురోజు రాత్రి కూడా ఏదో ఓ మార్పు చేస్తూనే ఉంటారు. అసలు అంత హడావిడి ఎందుకు.. 2 వారాల ముందే ఫస్ట్ కాపీ రెడీ చేయమంటున్నారు నాగ్. కానీ ఇప్పుడున్న ఇండస్ట్రీ వర్కింగ్ స్టైల్‌కు అది సాధ్యమేనా..? ఏ సినిమాను తీసుకున్నా కూడా చివరి నిమిషపు మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఎవరి వరకో ఎందుకు.. తను నిర్మించిన లెనిన్ గురించే ఎగ్జాంపుల్ చెప్పారు నాగ్. ఈ సినిమా డేట్ జూన్ 26 ఇచ్చినా.. బెటర్‌మెంట్ కోసమే మరో రెండు వారాలు పోస్ట్ పోన్ చేసామని ఒప్పుకున్నారు నాగార్జున. కానీ ఆ పరిస్థితి ఎందుకు.. ముందే ఔట్ పుట్ ఇచ్చేమయని టెక్నీషియన్స్‌ను రిక్వెస్ట్ చేసారీయన. హాలీవుడ్‌లో ఒడిస్సీ లాంటి భారీ సినిమాలకు ఏడాది ముందే డేట్ ఇచ్చి అనుకున్న టైమ్‌కు రిలీజ్ చేస్తున్నపుడు మనమెందుకు చేయలేకపోతున్నాం అని ప్రశ్నిస్తున్నారు నాగార్జున. అన్నమయ్య, నిన్నే పెళ్లాడతా లాంటి సినిమాలన్నీ నెల ముందే ఫస్ట్ కాపీ చూసుకున్నామన్నారు నాగ్. మొత్తానికి కింగ్ చెప్పిన మాటలు మన దర్శక నిర్మాతలు చెవికెక్కించుకుంటారా లేదా అనేది చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!

మనుషులను చల్లబరిచే ఫ్రిజ్‌.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు

40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!

Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం

Follow Us