AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indrakeeladri: దసరా ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి.. ఏ రోజున ఏ అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారంటే..

ఈ ఏడాది దేవి నవరాత్రులు అక్టోబర్ 15 నా నుండి ప్రారంభం కానున్నాయి. ఈ దేవి నవరాత్రుల్లో తొమ్మది  రోజుల్లో తొమ్మిది అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తారు. మొదటి రోజు స్నాపనభిషేకం ప్రత్యేక అలంకారం, పూజ కార్యక్రమం అనంతరం బాలాత్రిపుర సుందరి దేవిగా దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. నవరాత్రుల్లో రెండో రోజు 16 న గాయత్రీ దేవిగా, మూడో రోజు 17 న అన్నపూర్ణ దేవిగా అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.

Indrakeeladri: దసరా ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి.. ఏ రోజున ఏ అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారంటే..
Indrakeeladri Temple
P Kranthi Prasanna
| Edited By: Surya Kala|

Updated on: Sep 06, 2023 | 2:19 PM

Share

అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి వేడుకలకు సిద్ధం అవుతుంది. అక్టోబర్ 15 నుండి 23 వరకు నవరాత్రులను నిర్వహించడానికి ఇప్పటికే వైదిక కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో దసరా శరన్నవరాత్రి వేడుకలకు దుర్గమ్మ ఆలయాన్ని రెడీ చేసేందుకు ఇప్పటికే ఆలయ అధికారులు ఏర్పాట్లపై నిమగ్నం అయ్యారు.

ఈ ఏడాది దేవి నవరాత్రులు అక్టోబర్ 15 నా నుండి ప్రారంభం కానున్నాయి. ఈ దేవి నవరాత్రుల్లో తొమ్మది  రోజుల్లో తొమ్మిది అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తారు. మొదటి రోజు స్నాపనభిషేకం ప్రత్యేక అలంకారం, పూజ కార్యక్రమం అనంతరం బాలాత్రిపుర సుందరి దేవిగా దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. నవరాత్రుల్లో రెండో రోజు 16 న గాయత్రీ దేవిగా, మూడో రోజు 17 న అన్నపూర్ణ దేవిగా అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. ఇక నవరాత్రుల్లో నాల్గో రోజు 18వ తేదీన మహాలక్ష్మి దేవిగా, ఐదో రోజు 19 న లలితా త్రిపుర సుందరి దేవిగా కొలువుదీరనున్నారు. నవరాత్రుల్లో ఆరవ రోజు మూలా నక్షత్రంలో దుర్గమ్మ 20 న సరస్వతి దేవిగా, ఏడవ రోజు 21వ తేదీన కనక దుర్గ దేవిగా,  ఎనిమిదవ రోజు 22 న మహిషాశుర మర్దినిగా, నవరాత్రుల్లో చివరి రోజు 23 న రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు కానక దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు.

ఒక్క మొదటి రోజు మాత్రం అమ్మవారి స్వప్నాభిషేకం అనంతరం ఉదయం 9 గంటల తర్వాత అమ్మవారి దర్శనాలు ప్రారంభం అవుతాయి. రాత్రి 10 గంటల వరకు భక్తులు దుర్గమ్మను దర్శించుకునే వీలుని కల్పించనున్నారు. మిగతా రోజుల్లో తెల్లవారు జామున 4 గంటల నుండే దర్శనాలు ప్రారంభంకానున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా మూలా నక్షత్రం రోజైన 20 వ తేదీన సరస్వతి అలంకారంలో ఉన్న అమ్మవారిని తెల్లవారు జామున 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శించుకోవచ్చు. 23 వ తేదీ విజయదశమి రోజున 10:30లకు పూర్ణాహుతితో దేవి నవరాత్రులు ముగుస్తాయి.

ఇవి కూడా చదవండి

ఆ రోజు సాయంత్రం దుర్గామలేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం జరగనుంది. అమ్మవారు స్వామివారితో కలిసి  హంస వాహనంపై కృష్ణ నదిలో విహారం చేస్తారు. నవరాత్రుల కోసం ఇప్పటికే 4 కోట్లతో తాత్కాలిక టెండర్స్ కు పిలుపునిచ్చారు ఆలయ అధికారులు. లైటింగ్, ఎలక్ట్రికల్ నుండి క్యూ లైన్స్, కృష్ణ నది వద్ద ఘాట్స్ మర్మత్తులపై .. ఘాట్ల వద్ద స్నానాలు చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు ఆలయ అధికారు. నవరాత్రులు దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చెయ్యనున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు