Telangana: పంట పొలాల్లో అంబరాన్నంటుతున్న సంబరాలు.. సీఎంకు వినూత్న రీతిలో కృతజ్ఞతలు..!

రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల రుణ మాఫీ సంబరాలు అంబరాన్నంటాయి. మొదటి విడత ప్రకటించిన జాబితాలో వారి రుణాలు మాఫీ అవుతుండడంతో రైతులు ఆనందంతో ఉప్పొంగి పోతున్నారు. పంట పొలాల్లోనే కేక్ కట్ చేసుకుని మిఠాయిలు పంచుకున్నారు.

Telangana: పంట పొలాల్లో అంబరాన్నంటుతున్న సంబరాలు.. సీఎంకు వినూత్న రీతిలో కృతజ్ఞతలు..!
Farmers Celebrations
Follow us
G Peddeesh Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Jul 18, 2024 | 1:30 PM

రుణ మాఫీతో తెలంగాణ రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వాలు చేయలేని పనిని.. కాంగ్రెస్‌ సర్కార్‌ చేసి చూపించిందని అనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల రుణ మాఫీ సంబరాలు అంబరాన్నంటాయి. మొదటి విడత ప్రకటించిన జాబితాలో వారి రుణాలు మాఫీ అవుతుండడంతో రైతులు ఆనందంతో ఉప్పొంగి పోతున్నారు. పంట పొలాల్లోనే కేక్ కట్ చేసుకుని మిఠాయిలు పంచుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు జరుపుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణ మాఫీ మొదటి లిస్టు ప్రకటించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆనందంతో ఉప్పొంగి పోయారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ వినూత్న రీతిలో సంబరాలు జరుపుకుంటున్నారు . జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ వినూత్న రీతిలో సంబరాలు జరుపుకున్నారు. లక్ష రూపాయల తీసుకున్న రైతుల రుణాలు మాఫీ అవుతుండటంతో సంతోషం వ్యక్తం చేస్తూ వారి వ్యవసాయ క్షేత్రంలోని నారుమడుల్లో సీఎం రేవంత్ రెడ్డి , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు.. అనంతరం రైతులంతా కలిసి అదే పొలంలో నాగలి గొర్రు కర్రకు కాంగ్రెస్ జెండాను కట్టి ఎగరవేశారు. పంట పొలాల్లో చుట్టుపక్కల రైతులంతా కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు..

రుణమాఫీ అవుతున్న ఆనందంతో కేరింతలు కొడుతూ పశువులకు తిలకం దిద్ది ఒకరికొకరు అలయ్ బలయ్ చేసుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు. రుణమాఫీ విషయంలో గత ప్రభుత్వాలు మాటలకే పరిమితమయ్యాయన్నారు ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్‌ ప్రభుత్వం… రైతులకు ఇవాళ లక్ష రుణమాఫీ చేస్తోందన్నారు. అటు దేవరుప్పుల మండలంలో పంట పొలాల్లోనే కేక్ కట్ చేసారు రైతులు. గ్రామ గ్రామాన ఇదే రీతిలో కాంగ్రెస్‌ శ్రేణుల ఆధ్వర్యంలోనూ వేడుకలు గ్రాండ్‌గా జరగున్నారు. అటు మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం కొరవిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు. రుణ మాఫీ హామీ ఇచ్చి తమకు ఆర్థికంగా అండగా నిలిచినందుకు ధన్యవాదాలు చెప్పారు.

వీడియో చూడండి.. 

మరోవైపు ప్రజాభవన్‌లో బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం అయ్యారు. రుణమాఫీ అమలుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధానంగా చర్చించారు. ఈ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశానికి భట్టి, తుమ్మలతోపాటు అధికారులు హాజరయ్యారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం కావడంతో ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా చూసేలా కార్యాచరణపై ఫోకస్‌ పెట్టారు. ప్రభుత్వం ఇచ్చే రుణ మాఫీ డబ్బులు, మరే ఇతర రైతుల అప్పులకు మళ్లించరాదని బ్యాంకర్లకు సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…