Telangana: తెలంగాణలో కేదారనాథ్ తరహా ఆలయ నిర్మాణం.. ఎక్కడంటే..

Telangana: తెలంగాణలో కేదారనాథ్ తరహా ఆలయ నిర్మాణం.. ఎక్కడంటే..

Ram Naramaneni

|

Updated on: Jul 18, 2024 | 1:33 PM

చార్‌ ధామ్‌ యాత్రకు వెళ్లేందుకు వీలుకాని భక్తులు ఇక్కడ నిర్మించబోతున్న కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకోవచ్చని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు తెలిపారు. తాజాగా ఈ టెంపుల్‌కు సంబంధించిన భూమి పూజ జరిగింది.

తెలంగాణలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదారనాథ్ ఆలయాన్ని పోలి ఉండేలా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మేడ్చల్ మండల ఎల్లంపేట గ్రామంలో ఈ రోజు ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించారు. వారణాసి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య, అయోధ్యధామ్ మహంతి కమల్ నారాయణదాసు మహారాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు.. భూమి పూజ చేసే స్ధలం దగ్గరకు నాగుపాము వచ్చింది. దీంతో సాక్షాత్తు నాగేశ్వరుడే వచ్చి ఆశీర్వదించారని ఆలయ నిర్మాణ కమిటీ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.. పంచ భూతాలా సాక్షిగా కేదర్‌ నాథ్ ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగిందని సంత్లు తెలిపారు.

ప్రసిద్ధ కేదారనాథ్ ఆలయాన్ని ఇక్కడ నిర్మించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు చెప్పారు. చార్‌ ధామ్‌ యాత్రకు వెళ్లేందుకు వీలుకాని భక్తులు ఇక్కడ నిర్మించబోతున్న కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకోవచ్చని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంత్ రావ్ పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని ఆలయ కమిటీ సభ్యులకు ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.

మరిన్ని  తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..   

Published on: Jul 18, 2024 01:06 PM