AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఊరూరా తిరుగుతూ.. జోలెపట్టి బిక్షాటన చేసిన మాజీ మంత్రి..

Watch Video: ఊరూరా తిరుగుతూ.. జోలెపట్టి బిక్షాటన చేసిన మాజీ మంత్రి..

Nalluri Naresh
| Edited By: Srikar T|

Updated on: Jul 18, 2024 | 5:37 PM

Share

రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయన పేరు తెలియని వారు ఉండరు. మాజీ మంత్రిగా.. మాజీ పిసిసి అధ్యక్షులుగా పనిచేసిన రఘువీరారెడ్డి భిక్షాటన చేస్తున్నారు. అనంతపురం జిల్లాలోని నీలకంఠాపురంలో సిడబ్ల్యుసి మెంబర్ రఘువీరారెడ్డి వీధుల వెంబడి తిరుగుతూ.. ఇంటింటికీ వెళ్లి బిక్షాటన చేపట్టారు. మడకశిర పట్టణంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో ఈనెల 21 జరగనున్న గురు పౌర్ణమి వేడుకల్లో ప్రజలందరినీ భాగస్వాములను చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయన పేరు తెలియని వారు ఉండరు. మాజీ మంత్రిగా.. మాజీ పిసిసి అధ్యక్షులుగా పనిచేసిన రఘువీరారెడ్డి భిక్షాటన చేస్తున్నారు. అనంతపురం జిల్లాలోని నీలకంఠాపురంలో సిడబ్ల్యుసి మెంబర్ రఘువీరారెడ్డి వీధుల వెంబడి తిరుగుతూ.. ఇంటింటికీ వెళ్లి బిక్షాటన చేపట్టారు. మడకశిర పట్టణంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో ఈనెల 21 జరగనున్న గురు పౌర్ణమి వేడుకల్లో ప్రజలందరినీ భాగస్వాములను చేసేందుకు.. రఘువీరారెడ్డి బిక్షాటన చేశారు. గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించేందుకు భక్తులు, ప్రజలతో కలిసి జోలె పట్టి భిక్షాందేహి.. అంటూ భిక్షాటన చేశారు. గ్రామస్తులను బియ్యం, డబ్బులు, నిత్యవసర సరుకులను భిక్షంగా స్వీకరించారు. తమరు తలుచుకుంటే గురు పౌర్ణమి వేడుకలను సొంత ఖర్చులతోనే నిర్వహించే స్తోమత ఉంది కదా అని రఘువీరారెడ్డిని అడిగితే.. సొంత ఖర్చులతో గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించి స్తోమత ఉన్నప్పటికీ.. ప్రజలందరినీ, బాబా భక్తులను గురు పౌర్ణమి వేడుకల్లో భాగస్వామ్యం చేసేందుకే భిక్షాటన కార్యక్రమం చేపట్టా అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..