AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana corona: కోవిడ్‌ నిబంధ‌న‌లు పాటించ‌ని వారిపై 8.79 ల‌క్ష‌ల కేసులు న‌మోదు.. హైకోర్టుకు విన్నవించిన డీజీపీ

Telangana Covid report: నిబంధ‌న‌లు పాటించ‌ని వారిపై ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 7 వ‌ర‌కు 8.79 ల‌క్ష‌ల కేసులు న‌మోదు చేసిన‌ట్లు ధ‌ర్మాస‌నానికి వివ‌రించారు. కోవిడ్ ఔష‌ధాల‌కు సంబంధించిన..

Telangana corona: కోవిడ్‌ నిబంధ‌న‌లు పాటించ‌ని వారిపై 8.79 ల‌క్ష‌ల కేసులు న‌మోదు.. హైకోర్టుకు విన్నవించిన డీజీపీ
DGP Mahender Reddy
Sanjay Kasula
|

Updated on: Jun 09, 2021 | 2:30 PM

Share

తెలంగాణ రాష్ట్రంలోని కోవిడ్ ప‌రిస్థితుల‌పై హైకోర్టుకు నివేదిక సమర్పించారు ప్ర‌జారోగ్య సంచాల‌కులు(DH) శ్రీ‌నివాస‌రావు, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి. క‌రోనా నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేస్తున్నామ‌ని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి తెలిపారు. నిబంధ‌న‌లు పాటించ‌ని వారిపై ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 7 వ‌ర‌కు 8.79 ల‌క్ష‌ల కేసులు న‌మోదు చేసిన‌ట్లు ధ‌ర్మాస‌నానికి వివ‌రించారు. కోవిడ్ ఔష‌ధాల‌కు సంబంధించిన బ్లాక్ మార్కెట్‌పై 160 కేసులు, మాస్కులు ధ‌రించ‌ని వారిపై 4.56 ల‌క్ష‌ల కేసులు నమోదు చేశామన్నారు. దీనికి సంబంధించి రూ.37.94 కోట్ల జ‌రిమానా, భౌతిక దూరం పాటించ‌నందుకు 48,643 కేసులు, లాక్‌డౌన్, క‌ర్ఫ్యూ ఉల్లంఘ‌న‌ల‌పై 3.43 కేసులు న‌మోదు చేసిన‌ట్లు డీజీపీ కోర్టుకు తెలిపారు.

క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు…

గ‌త నెల‌ 29వ తేదీ నుంచి రోజుకు స‌రాస‌రి ల‌క్ష క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తున్న‌ట్లు డీహెచ్‌ వివ‌రించారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 66,79,098 వ్యాక్సిన్లు వేసిన‌ట్లు తెలిపారు. ఆస్ప‌త్రుల్లో ఇన్ పేషెంట్లు త‌గ్గుతున్నార‌ని.. ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో 36.50 శాతం, ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో 16.35 శాతం ప‌డ‌క‌లు నిండిన‌ట్లు ఆయ‌న‌ తెలిపారు.

క‌రోనా మూడో ద‌శ వ‌స్తే..

క‌రోనా మూడో ద‌శ వ‌స్తే ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్న‌ట్లు హైకోర్టుకు స‌మ‌ర్పించిన నివేదిక‌లో డీహెచ్‌ పేర్కొన్నారు. ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో 10,366 బెడ్ల‌ను ఆక్సిజ‌న్ ప‌డక‌లుగా మార్చిన‌ట్లు చెప్పారు. మ‌రో 15వేల ప‌డ‌క‌ల‌కు కూడా ఆక్సిజ‌న్ ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

రాష్ట్రంలోని ఆస్ప‌త్రుల్లో 132 ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి కేంద్రాల ఏర్పాటుకు అనుమ‌తి ఇచ్చిన‌ట్లు డీహెచ్ శ్రీ‌నివాస‌రావు తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా పిల్ల‌ల కోసం నాలుగు వేల ప‌డ‌క‌ల ఏర్పాట్ల‌తో పాటు నిలోఫ‌ర్ ఆస్ప‌త్రిలో మ‌రో వెయ్యి ప‌డ‌క‌లు సిద్ధం చేస్తున్న‌ట్లు ఆయ‌న నివేదిక‌లో పేర్కొన్నారు. వైద్య సిబ్బంది పెంపున‌కు, శిక్ష‌ణ‌కు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేస్తున్నామ‌న్నారు.

ఇవి కూడా చదవండి : Hyderabad Metro: లాక్‏డౌన్ సడలింపు.. రేపట్నుంచి హైదరాబాద్‏లో మెట్రో పరుగులు.. మారిన టైమింగ్స్ ఇవే..

Liger Movie: ‘లైగర్’ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. థ్రిల్లింగ్ ట్విస్టులతో విజయ్ మూవీ  క్లైమాక్స్ ?

TV9 Campaign Vaccinate All: వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు.. దేశంలో అందరికీ వ్యాక్సిన్ అందాలన్నదే టీవీ 9 నినాదం..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి