Liger Movie: ‘లైగర్’ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. థ్రిల్లింగ్ ట్విస్టులతో విజయ్ మూవీ  క్లైమాక్స్ ?

Liger Movie Update: విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం సినిమా 'లైగర్'.

Liger Movie: 'లైగర్' సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. థ్రిల్లింగ్ ట్విస్టులతో విజయ్ మూవీ  క్లైమాక్స్ ?
Liger
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 09, 2021 | 10:45 AM

Liger Movie Update: విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం సినిమా ‘లైగర్’. విజయ్ కి తెలుగుతో పాటు హిందీ లోనూ మంచి పాపులారిటీ ఉండడంతో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కామ్ డిస్ట్రబ్యూటర్ కరణ్ జోహార్ హిందీ లో రిలీజ్ చేయబోతున్నాడు. ఈ సినిమా తో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన లుక్ ని పూర్తిగా మార్చేశాడు. ఇప్పటికే విడుదలైన విజయ్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక విజయ్ లుక్ చూసి.. ఈ మూవీ పై అంచనాలు మరింతగా పెంచుకున్నారు అభిమానులు. అయితే ఈ సినిమా ఆరంభం నుంచి ఎన్నో రకాల గాసిప్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ మూవీ క్లైమాక్స్ పై ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లైగర్ మూవీ మొత్తానికి క్లైమాక్స్ సీన్ హైలెట్‏గా నిలువనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులోని క్లైమాక్స్ దాదాపు పదిహేను నిమిషాలు ఉంటుందట. వెరీ ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్ యాక్షన్ తో పాటు ట్విస్ట్ లతో ఆడియన్స్ ను థ్రిల్ చేస్తోందట. ఈ సినిమాలో కీలకమైన యాక్షన్ సీన్ లో రియల్ ఇంటర్ నేషనల్ బాక్సర్ నటించబోతున్నట్లుగా సమాచారం. ఈ సినిమాను సెప్టెంబర్ 9న దేశవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read: Radhe Shyam Movie: ఓటీటీ సంస్థల చూపు ‘రాధేశ్యామ్’ మూవీ పైనే.. ప్రభాస్ సినిమాకు భారీ ఆఫర్ ఇచ్చిన ప్రైమ్ ?

Bimbisara Movie: కళ్యాణ్ రామ్ సినిమాలో భాగం కానున్న ఎన్టీఆర్.. ‘బింబిసార’ కోసం యంగ్ టైగర్ వాయిస్ ?

Samantha Akkineni: యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్‌కి బెట‌ర్ ఆప్ష‌న్‌గా స‌మంత‌.. ఆకాశానికెత్తేస్తున్నారు బాలీవుడ్ క్రిటిక్స్