TV9 Campaign Vaccinate All: వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు.. దేశంలో అందరికీ వ్యాక్సిన్ అందాలన్నదే టీవీ 9 నినాదం..
దేశాన్ని కరోనా అల్లకల్లోలం చేస్తోంది. దేశమంతటా విరుచుకుపడింది. ఈ మహమ్మారి బారినపడి నిత్యం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు..
దేశాన్ని కరోనా అల్లకల్లోలం చేస్తోంది. దేశమంతటా విరుచుకుపడింది. ఈ మహమ్మారి బారినపడి నిత్యం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు కొవిడ్‌పై రకరకాల అపోహలు, అపనమ్మకాలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉంటున్నాయి. ప్రతి ఒక్కరికి స్మార్ట్‌ఫోన్ ఉన్న ఈ రోజుల్లో వాటిలో వచ్చే సూచనలు, సలహాలను పాటిస్తున్నారు. కొందరు సొంతంగా కొవిడ్‌కు చికిత్స తీసుకుంటున్నారు. అవసరం లేకపోయినా కొందరు సీటీస్కాన్‌ల కోసం ల్యాబ్‌ల వద్ద బారులుదీరుతున్నారు. కొందరైతే స్వల్ప లక్షణాలున్నా, తమకు ఏదో అవుతుందనే ఆందోళనతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడేలా టీవీ 9 కృషి చేస్తుంది.
దేశంలో అందరికీ వ్యాక్సిన్ అందాలి…ఇదే టీవీ 9 నినాదం. కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే అందరూ కచ్చితంగా టీకాలు తీసుకోవాలి. జాగ్రత్తలు పాటించాలి. అయితే, చాలా మందికి వ్యాక్సిన్ పై బోలెడు అనుమానాలున్నాయి. సాధారణంగా కొత్తది ఏదైనా వచ్చింది అంటే దానిపై వ్యతిరేకత ఉంటుంది. కానీ, కరోనా వ్యాక్సిన్ విషయంలో అది సరికాదు. కరోనామహమ్మారిని నిలువరించాలంటే టీకా ఒక్కటే ఆయుధం. ఎందుకంటే, కరోనాను మనదాకా రాకుండా చేయగలిగితేనే మనం దానిమీద గెలవగలం. అందుకే అందరికీ వ్యాక్సిన్ అంటోంది టీవీ9. అదే నినాదంతో ప్రత్యేకమైన ప్రచారం నిర్వహిస్తోంది. టీవీ 9 చేపట్టిన ఈ ప్రచారంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే, వ్యాక్సిన్ పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు నడుం బిగించింది టీవీ 9. కోవిడ్ వ్యాక్సిన్ పై వస్తున్న రకరకాల వార్తలలో నిజానిజాలను నిగ్గుదేల్చి తప్పుడు వార్తలను ఖండిస్తోంది.
కరోనా టీకా వేసుకుంటే.. వ్యాధి నిరోధక శక్తి మొత్తం పోతోంది అని ఇటీవల పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. టీకా తీసుకున్నవారు మరణిస్తారని చెబుతున్నారు. అయితే, అది పూర్తిగా తప్పు. అసలు వ్యాక్సిన్ ఏదైనా వ్యాధినిరోధక శక్తిని పెంచడం కోసమే ఉంటుంది. అటువంటిది ఇటువంటి ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. వ్యాక్సినేషన్ పై భయాన్ని పెంపొందిస్తున్నారు. నిపుణులు కూడా దీనిపై ఇదేరకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజల మేలు కోసం ఉన్నది ఉన్నట్టు వాస్తవాలకు దగ్గరగా, మెరుగైన సమాజం కోసం టీవీ 9 కృషి చేస్తుంది.