BSNL: రూ. 399 ప్లాన్.. వ్యాలిడిటీ పరంగా బీఎస్ఎన్ఎల్ నెంబర్ వన్.. ఆ తర్వాతే అన్ని నెట్‌వర్క్‌లు..
RS. 399 Plans: ఆధునిక ప్రపంచంలో సెల్ ఫోన్ అవసరంగా మారింది. ఈ క్రమంలో ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా (విఐ), బిఎస్ఎన్ఎల్ మొత్తం నాలుగు కంపెనీలు
RS. 399 Plans: ఆధునిక ప్రపంచంలో సెల్ ఫోన్ అవసరంగా మారింది. ఈ క్రమంలో ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా (విఐ), బిఎస్ఎన్ఎల్ మొత్తం నాలుగు కంపెనీలు మంచి మంచి ఆఫర్లతో వినియోదారులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రణాళికల పరంగా ఏదీ ఉత్తమమైనదో వినియోగదారులు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అపరిమిత (అన్‌లిమిటెడ్) కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ ప్యాకేజీ ఎలాంటి ధరలకు అందుబాటులో ఉన్నాయి.. కాలపరిమితి ఎప్పటివరకు ఉంటుంది అనేది తెలుసుకుంటే మేలు. ఈ నాలుగు టెలికామ్ ప్రొవైడర్ల రూ.399 ప్లాన్ గురించి మాట్లాడితే… ఏదీ ఉత్తమమో ఇప్పుడు తెలుసుకుందాం..
వీఐ (వొడాఫోన్ ఐడియా) రూ. 399 ప్లాన్ ఈ వీఐ ప్లాన్‌లో మీకు రోజుకు 1.5జిబి డేటా, 100 ఎస్ఎమ్ఎస్‌లు, అపరిమిత కాల్స్‌ను 56 రోజుల వరకు లభిస్తుంది. దీంతోపాటు అదన రీచార్జుల ద్వారా వారాంతపు డేటా రోల్ ప్రకారం.. విఐ మూవీలను కూడా ఆస్వాదించవచ్చు.
ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్ ఎయిర్ టెల్ రూ. 399 ప్లాన్ ద్వారా 56 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ప్రతిరోజూ 1.5 జీబీ హై స్పీడ్ డేటా, 100 ఎస్ఎమ్ఎస్‌లు అపరిమిత వాయిస్ కాల్స్ ఈ ప్లాన్‌లో ఉంటాయి. అదనంగా మీరు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్ లను కూడా పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఉచిత సబ్ స్క్రిప్షన్ ని 30 రోజుల పాటు పొందవచ్చు.
రిలయన్స్ జియో రూ.399 ప్లాన్ ఈ ప్లాన్ ద్వారా మీకు రోజుకు 1.5జిబి హై స్పీడ్ డేటా, 100 ఎస్ఎమ్ఎస్‌లు, అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. ప్రతిరోజూ మీరు పొందే డేటా అయిపోయిన తరువాత మీకు 64 కెబిపిఎస్ వేగంతో ఇంటర్నెట్ ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్ గడువు 56 రోజులు మాత్రమే.
బీఎస్ఎన్ఎల్ రూ.399 ప్లాన్.. బీఎస్ఎన్ఎల్ 399 ప్లాన్ ద్వారా మీరు మొత్తం 80 రోజుల పాటు వ్యాలిడిటీని పొందవచ్చు. మీకు ప్రతిరోజూ 1జిబి హై స్పీడ్ డేటా లభిస్తుంది. డేటా అయిపోయిన తరువాత 80 కెబిపిఎస్ వేగంతో ఇంటర్నెట్ ని ఉపయోగించవచ్చు. దీంతోపాటు.. అపరిమిత కాల్స్, 100 ఎస్ఎమ్ఎస్‌లు లభిస్తాయి.
Also read: