యాంటీ బాడీల వృద్ధికి మాస్ వ్యాక్సినేషన్ పరిష్కారం…..లక్నో మెడికల్ యూనివర్సిటీ రీసెర్చర్ల అధ్యయనంలో వెల్లడి
కరోనా వైరస్ చైన్ ని బ్రేక్ చేయాలంటే.....నిరోధించాలంటే సామూహికంగా ఈ ఇమ్యూనిటీని పెంచుకోవడమే ఉత్తమమని, మాస్ వ్యాక్సినేషన్ ద్వారా దీన్ని సాధించవచ్చునని లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ రీసెర్చర్లు తమ స్టడీలో తెలిపారు.
కరోనా వైరస్ చైన్ ని బ్రేక్ చేయాలంటే…..నిరోధించాలంటే సామూహికంగా ఈ ఇమ్యూనిటీని పెంచుకోవడమే ఉత్తమమని, మాస్ వ్యాక్సినేషన్ ద్వారా దీన్ని సాధించవచ్చునని లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ రీసెర్చర్లు తమ స్టడీలో తెలిపారు. అంతే తప్ప సహజసిద్దమైన ఇన్ఫెక్షన్ ట్రాన్స్ మిషన్ ద్వారా కాదని వీరు తేల్చారు. 989 మంది హెల్త్ కేర్ వర్కర్స్ పైన, సుమారు 500 మంది ప్లాస్మా డోనర్స్ పైన వీరు యాంటీ బడీ టెస్టులు నిర్వహించగా.. వ్యాక్సినేషన్ అనంతరం ఏర్పడిన యాంటీబాడీలు బలంగా.. ఎక్కువకాలం ఉన్నాయని వెల్లడైంది. అయితే ఇన్ఫెక్షన్ అనంతరం ఏర్పడిన యాంటీ బాడీలు బలహీనంగా ఉండడమే గాక దాదాపు 4 నెలల్లోనే కనుమరుగయ్యాయని కొన్ని కేసుల్లో చాలా తక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనపత్రం పేర్కొంది. ఈ హెల్త్ వర్కర్లలో నాలుగో తరగతి ఉద్యోగులు, జూనియర్ డాక్టర్లు, స్టాఫ్, సీనియర్ ఫేకల్టీ సభ్యులు ఉన్నారు. 869 మందిలో 88 శాతం యాంటీ బాడీలు వృద్ధి అయ్యాయి. వీరిలో 73 శాతం మంది రెండు డోసులు, 13 శాతం మంది ఒక డోసు టీకామందు తీసుకున్నారు. మిగిలినవారు వ్యాక్సిన్ తీసుకోలేదని, కొన్ని నెలలుగా వీరికి ఇన్ఫెక్షన్ సోకిందని ఈ రీసెర్చర్లు వెల్లడించారు. 61 మందిలో రెండు డోసులు తీసుకున్న తరువాత కూడా తగినన్ని యాంటీ బాడీలు వృద్ధి కాలేదు. 25 మంది ఒక డోసు తీసుకున్నప్పటికీ వీటిని వృద్ధి పరచుకోలేకపోయారు. మొత్తం మీద మాస్ వ్యాక్సినేషన్ ద్వారా హెర్డ్ ఇమ్మ్యూనిటీ పెరగడంతో బాటు యాంటీ బాడీలు కూడా వృద్ధి అయిన విషయం తేటతెల్లమైందని ప్రొఫెసర్ తులికా చంద్ర తెలిపారు.
మళ్ళీ ఈ హెల్త్ కేర్ వర్కర్లలో కొందరిపై యాంటీ బాడీ టెస్టులు నిర్వహిస్తామని ఆమె చెప్పారు. తమ ప్రయోగం ఇంకా ప్రాథమిక దశలోనే ఉందన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: క్రికెట్ చరిత్రలో అద్భుతమైన మ్యాచ్.. రెండు పరుగులకే నాలుగు వికెట్లు.. ఇన్నింగ్స్‌లో ఒకటే ఫోర్.. టార్గెట్ 101..