క్రికెట్ చరిత్రలో అద్భుతమైన మ్యాచ్.. రెండు పరుగులకే నాలుగు వికెట్లు.. ఇన్నింగ్స్‌లో ఒకటే ఫోర్.. టార్గెట్ 101..
రువాండాలో జరుగుతున్న క్విబుకా మహిళల టీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో రసవత్తరమైన మ్యాచ్ ఒకటి జరిగింది. జూన్ 7న జరిగిన ఈ మ్యాచ్‌లో నమీబియా..
రువాండాలో జరుగుతున్న క్విబుకా మహిళల టీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో రసవత్తరమైన మ్యాచ్ ఒకటి జరిగింది. జూన్ 7న జరిగిన ఈ మ్యాచ్‌లో నమీబియా మహిళల జట్టు 43 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మొదట ఆడిన నమీబియా.. ఓపెనర్ అడ్రి వాన్ డెర్ మెర్వ్ చక్కటి ప్రదర్శన ఇవ్వడంతో.. నిర్ణీత ఓవర్లకు ఆరు వికెట్లు నష్టపోయి 101 పరుగులు చేసింది. ఇక వారి బౌలర్లు ప్రత్యర్ధి జట్టు రువాండా ఉమెన్‌ను 58 పరుగులకే పరిమితం చేశారు. ఈ విజయంతో నమీబియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అదే సమయంలో, రువాండా ప్రస్తుతం మూడవ స్థానంలో కొనసాగుతోంది.
టాస్ ఓడిపోయిన తర్వాత మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించింది. అడ్రి వాన్ డెర్ మెర్వ్ (29), అరిస్టా డైగర్ట్ (20) ఐదు ఓవర్లలో తొలి వికెట్‌కు 36 పరుగులు జోడించారు. ఇక వాన్ డెర్ మెర్వ్ అవుట్ అయిన వెంటనే నమీబియా జట్టు పతనం మొదలైంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అందరూ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. అయితే లోయర్ ఆర్డర్ సహాయంతో నమీబియా జట్టు 100 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.
రెండు పరుగులకు నాలుగు వికెట్లు పడిపోయాయి..
టార్గెట్‌ను చేధించే క్రమంలో.. రువాండా జట్టు మొదటి నుంచి ఇబ్బంది పడింది. ఓపెనర్ గిసెల్లె ఇషిమ్వే ఇన్నింగ్స్ మూడో బంతికి అవుట్ కాగా.. ఆ తర్వాత మరో ముగ్గురు బ్యాట్స్‌మెన్లు డకౌట్‌గా వెనుదిరిగారు. అప్పటికి టీం స్కోర్ రెండు పరుగులు మాత్రమే. దీనితో ఆ జట్టు విజయావకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి.
మొత్తం ఇన్నింగ్స్‌లో కేవలం ఒక ఫోర్ మాత్రమే..
రువాండా జట్టు ఇన్నింగ్స్ మొత్తంలో కేవలం ఒక్క బౌండరీ మాత్రమే నమోదైంది. సిఫా ఇంగాబైర్ (12), హెన్రియెట్ ఇషిమ్వే (12), ఎలిస్ ఇకువే (11)లు డబుల్ ఫిగర్‌ను దాటారు. నిర్ణీత ఓవర్లకు ఎనిమిది వికెట్లు నష్టపోయి 58 పరుగులు మాత్రమే చేయగలిగారు.
ఇవి చదవండి:
రెప్పపాటులో ఊహించని యాక్సిడెంట్.. కుక్క ఓవర్ స్పీడ్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే! వైరల్ వీడియో
ఆ వ్యాక్సిన్ వేసుకున్న వరుడే కావలెను.. నవ్వులు పూయిస్తున్న వధువు పెళ్లి ప్రకటన..
వీడు మామూలోడు కాదు.. సెహ్వాగ్, డివిలియర్స్‌ను మించిపోయాడు.. 20 బంతుల్లో సెంచరీ బాదేశాడు..