WTC 2021 : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు..! ఎక్కువ పరుగులు ఎవరు చేస్తారు..? ఈ మాజీ ప్లేయర్ ఎవరి పేరు చెబుతున్నాడంటే

World Test Championship 2021 : ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జూన్ 18 న ఇంగ్లాండ్‌లో ప్రారంభమవుతుంది.

WTC 2021 : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు..! ఎక్కువ పరుగులు ఎవరు చేస్తారు..? ఈ మాజీ ప్లేయర్ ఎవరి పేరు చెబుతున్నాడంటే
Ajit Agarkar
Follow us
uppula Raju

|

Updated on: Jun 09, 2021 | 2:36 PM

World Test Championship 2021 : ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జూన్ 18 న ఇంగ్లాండ్‌లో ప్రారంభమవుతుంది. ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌కు ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్‌కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌పై ఇండియన్ మాజీ టెస్ట్ క్రికెటర్ అజిత్ అగర్కర్ పెద్ద అంచనా వేశాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి అత్యధిక పరుగులు చేసే ఆటగాడు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ప్రత్యేక పేరు చెప్పారు.

ఎవరు ఎక్కువ పరుగులు చేస్తారు? ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్‌లో ఎవరు ఎక్కువ పరుగులు చేస్తారు, ఎవరు మంచి బ్యాటింగ్ చేస్తారు, అనే దానిపై చర్చ జరుగుతోంది. ఫైనల్‌లో ఎవరు ఎక్కువ పరుగులు చేస్తారు అని మాజీ టెస్ట్ క్రికెటర్ అజిత్ అగార్కర్‌ను అడిగినప్పుడు అతను భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరును ప్రస్తావించాడు.

మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు? భారతదేశం, న్యూజిలాండ్ మధ్య జరిగే ఆఖరి మ్యాచ్లో ఎవరు గెలుస్తారనే చర్చ కూడా జరుగుతోంది. వెటరన్ ప్లేయర్స్ ఇరు జట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అగర్కర్ కూడా కొన్ని అంచనాలు వేశారు. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలవగలరో ఇప్పుడే చెప్పడం కష్టం. ఎందుకంటే ఇరు జట్లు సమానంగా బలంగా, ఉన్నాయని అగార్కర్ తెలిపాడు. పుజారా, షమీ ఈ మ్యాచ్‌లో మంచి ప్రతిభను కనబరచవచ్చని భారత మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అంచనా వేశారు. ఈ మ్యాచ్ జూన్ 18 నుంచి 22 వరకు ఇంగ్లాండ్‌లో జరుగుతుంది. మ్యాచ్ డ్రా లేదా టై అయితే ఇరు జట్లు ఉమ్మడి విజేతలుగా ఉంటాయి.

YSR Beema: సాధారణ మరణానికి రూ.లక్ష.. ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షలు సాయం!

Covid-19 Vaccine Certificate: కోవిడ్‌ టీకా సర్టిఫికేట్‌లో లోపాలున్నాయా..? అయితే ఇలా సరి చేసుకోవండి..!

Covid-19: మావోయిస్టులపై కరోనా పంజా.. పలువురు అగ్రనేతలకు పాజిటివ్..? పోలీసుశాఖ అప్రమత్తం