AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dharani Portal Issues: కలెక్టర్లతో సీఎస్ సోమేష్ కుమార్ సమావేశం.. భూ సమస్యలపై కీలక ఆదేశాలు జారీ..

Dharani Portal Issues: ధరణి పోర్టల్‌లో భూ సంబంధిత వివిధ కేటగిరీల పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ..

Dharani Portal Issues: కలెక్టర్లతో సీఎస్ సోమేష్ కుమార్ సమావేశం.. భూ సమస్యలపై కీలక ఆదేశాలు జారీ..
Cs Somesh Kumar
Shiva Prajapati
|

Updated on: Jun 05, 2021 | 5:41 PM

Share

Dharani Portal Issues: ధరణి పోర్టల్‌లో భూ సంబంధిత వివిధ కేటగిరీల పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. శనివారం నాడు సీఎస్ సోమేష్ కుమార్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణి ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం, కొత్త కలెక్టరేట్ భవనాల నిర్మాణాలు, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ లు, కొత్తగా మంజూరైన వైద్య కళాశాల ఏర్పాటు, ధరణి పోర్టల్ లో గ్రీవెన్స్, పరిష్కారం తదితర అంశాలపై సీఎస్ సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం సోమేష్ కుమార్.. ధరణి పోర్టల్ లో భూ సంబంధిత ఫిర్యాదులు, వివిధ కేటగిరీలలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జూన్ 10వ తేదీ లోగా భూసంబంధిత అంశాలు, ప్రోహిబిటెడ్ ప్రాపర్టీస్ కు సంబంధించిన దరఖాస్తులు అన్నింటిని పరిష్కరించాలని ఆదేశించారు. ధరణి పోర్టల్ లో ఆయా మాడ్యూల్స్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటినీ ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పరిష్కరించాలని స్పష్టం చేశారు.

ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కొరకు భూమిని గుర్తించి టిఎస్ఐఎస్‌సి కి స్వాధీనం చేయాలని దిశానిర్దేశం చేశారు. కనీసం వంద ఎకరాలకు తక్కువ కాకుండా ఉండాలని, ఎంత వీలైతే అంత ఎక్కువ స్థలాన్ని గుర్తించి స్వాధీనం చేయాలన్నారు. ఇక కొత్తగా మంజూరైన వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆయా జిల్లాల కలెక్టర్లు వెంటనే స్థలాన్ని గుర్తించి సంబంధిత శాఖకు స్వాధీనం చేయాలని సీఎస్ సూచించారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాలను ప్రారంభించడానికి సిద్ధం చేయాలన్నారు. నిర్మాణ దశలో ఉన్న కలెక్టరేట్ల పనులను వేగవంతం చేసి త్వరిత గతిన అన్ని హంగులతో పూర్తి చేయాలని ఆదేశించారు.

Also read:

కరోనా తో కన్ను మూసినా మగసింహం..!పోస్టుమార్టం లో తెలిసిన షాకింగ్ నిజాలు.ఇంకా 13 సింహాలకు పాజిటివ్ గా రిపోర్ట్ : Lion Video.